విధాత: ఓ త‌ల్లి త‌న ప‌సిబిడ్డ‌ను ఒడిలో పెట్టుకుని ఊయ‌ల‌లో ఊగుతోంది. బిడ్డ నిద్ర‌లోకి జారుకోవ‌డంతో ఆమె ఊయ‌ల దిగింది. ఆ త‌ర్వాత ఊయ‌ల‌ను అలానే ఊపుతూ ఉండిపోయింది. అప్ప‌టికే ఊయ‌ల కింద ఓ భారీ పాము బుస‌లు కొడుతూ.. ఊయ‌ల‌లో ఉన్న పాప వైపు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఊయ‌ల‌లో ప‌సిపాప‌.. బుస‌లు కొడుతూ ద‌గ్గ‌రకొచ్చిన పాము https://t.co/gXucmP1L4D pic.twitter.com/NrufaplydJ — vidhaathanews (@vidhaathanews) December 15, 2022 కానీ పామును ఆ త‌ల్లి గ‌మ‌నించ‌లేదు. బుస‌లు […]

విధాత: ఓ త‌ల్లి త‌న ప‌సిబిడ్డ‌ను ఒడిలో పెట్టుకుని ఊయ‌ల‌లో ఊగుతోంది. బిడ్డ నిద్ర‌లోకి జారుకోవ‌డంతో ఆమె ఊయ‌ల దిగింది. ఆ త‌ర్వాత ఊయ‌ల‌ను అలానే ఊపుతూ ఉండిపోయింది. అప్ప‌టికే ఊయ‌ల కింద ఓ భారీ పాము బుస‌లు కొడుతూ.. ఊయ‌ల‌లో ఉన్న పాప వైపు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

కానీ పామును ఆ త‌ల్లి గ‌మ‌నించ‌లేదు. బుస‌లు కొడుతున్న పాము శ‌బ్దాన్ని విన్న‌ ఆ త‌ల్లి భారీ పామును చూసి భ‌య‌ప‌డి ఒక్క‌సారిగా ఊయ‌ల‌ను ముందుకు లాగింది. అనంత‌రం బిడ్డ‌ను ఒడిలోకి తీసుకొని అటు నుంచి వెళ్లిపోయింది.

ఇదంతా ఇంటి మెయిన్ డోర్ వ‌ద్దే జ‌రిగింది. ఈ దృశ్యాలు ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Updated On 15 Dec 2022 3:37 PM GMT
krs

krs

Next Story