పట్టణ ప్రగతిలో ఏ సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలి ? కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు 6వ డివిజన్ పాదయాత్రలో నాయిని విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అభివృద్ధిపై నిలదీస్తే విపక్షాల నాయకులను భయభ్రాంతులను చేస్తూ వారిపై దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) విమర్శించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్‌కి అవకాశం ఇచ్చినా ఏం అభివృద్ధి జరిగిందో మీకు తెలుసని […]

  • పట్టణ ప్రగతిలో ఏ సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలి ?
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు
  • 6వ డివిజన్ పాదయాత్రలో నాయిని

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అభివృద్ధిపై నిలదీస్తే విపక్షాల నాయకులను భయభ్రాంతులను చేస్తూ వారిపై దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) విమర్శించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్‌కి అవకాశం ఇచ్చినా ఏం అభివృద్ధి జరిగిందో మీకు తెలుసని అన్నారు. హాత్ సే హాత్ జోడో (Hath Say Hath Jodo) యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా నాయిని రాజేందర్ రెడ్డి శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాదయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో, ప్రజలతో ముఖా ముఖి కార్యక్రమం పెట్టి గతంలో మీ దగ్గర తీసుకున్న సమస్యలను ఎంతవరకు పరిష్కరించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నాయకులకు ముందు చూపు లేదని మాటలకే కానీ చేతలకు కాదు, ప్రజా సంక్షేమం కోసం ఏమి చేయలేదని విమర్శించారు. వీళ్లకు పర్సెంటేజీల మీద ఉన్న ఇంట్రస్ట్ అభివృద్ధి పై లేదన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వాలని రాజేందర్ రెడ్డి కోరారు.

ఈ పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Sitakka) పాల్గొన్నారు. కమ్మరి వాడ, మార్కెట్ సెంటర్, పద్మశాలి వాడ, గణేష్ నగర్ - బొక్కల గడ్డ, ఈద్గా మీదుగా సాగి కిషన్ పుర వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల చార్జ్ షీట్ ను, ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల రూపంలో వివరించారు. కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ పాద యాత్రలో డివిజన్ అద్యక్షుడు అగర్దీది శివాజీ, బొమ్మతి విక్రం, బాబా భాయి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, వి. లక్ష్మి ప్రసాద్, ఎదులాపురం లక్ష్మణ్, నల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated On 11 March 2023 10:05 AM GMT
Somu

Somu

Next Story