విధాత: నల్గొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. చిట్యాల ఎస్ఐ ధర్మ తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్‌కు చెందిన హంద్రీ రాజు( 30) బైక్ పై నల్గొండకు వెళుతున్న క్రమంలో పెద్దకాపర్తి శివారులో డివైడర్‌ను ఢీకొట్టాడు.
ప్రమాదంలో హంద్రీరాజు, అతని కొడుకు ప్రిన్స్ నోయల్( 5 )మృతిచెందగా భార్య, కుమార్తకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నల్గొండ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.