Tuesday, January 31, 2023
More
    Homeతెలంగాణ‌ఉమ్మడి నల్గొండలో 22 లక్షల మందికి కంటి పరీక్షలు: మంత్రి జగదీష్ రెడ్డి

    ఉమ్మడి నల్గొండలో 22 లక్షల మందికి కంటి పరీక్షలు: మంత్రి జగదీష్ రెడ్డి

    విధాత: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 22 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా మంత్రి జి. జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం
    సూర్యాపేట మున్సిపాల్టీ కుడ-కుడలోని ఒకటో వార్డు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు రెండవ విడత తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

    ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూతెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం దేశం మొత్తానికి వెలుగు నిస్తుందన్నారు. భౌతికంగా చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ప్రసాదించడానికి చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు.. సాధారణంగా పని చేసుకునే వారు తమ చూపు ను నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ప్రభత్వమే వారి వద్దకు వెళ్ళి పరీక్షలు చేసి వారికి చూపును ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అని మంత్రి అన్నారు.

    ఇప్పటికే వైవిధ్య రంగాలలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రం కంటి వెలుగు కార్యక్రమం తో వైద్య రంగం లో కూడా రోల్ మోడల్ అయిందని అన్నారు.. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల కు వెళ్ళాలంటే సర్కారు వైద్యం వద్దు బిడ్డో అంటూ పాటలు కట్టి ప్రభుత్వ వైద్యం రంగాన్ని ఎద్దేవా చేసిన పరిస్థితులు ఉండేవన్నారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి తీసుకువచ్చిన మార్పులతో సర్కారు వైద్యం మాత్రమే కావాలనే రోజులు వచ్చాయని మంత్రి అన్నారు.

    ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా శిబిరం లో పరీక్షలు నిర్వహించుకున్న పలువురి కి మంత్రి కళ్ల జోడులు, మందులు పంపిణీ చేశారు.

    కేసీఆర్ నాయకత్వంలోని బీఅర్ఎస్ పార్టీ ఆవిర్భావం దేశ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుడుతుందని అన్రునా. నిన్న ఖమ్మం సభ సక్సెస్ తో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. దేశంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని విపక్షాల ముఖ్యమంత్రులు ప్రజలకు విడమర్చి చెప్పారని మంత్రి అన్నారు. దేశంలో దరిద్రానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే అని, 75 ఏళ్లుగా ఏలిన ఈ రెండు పార్టీలే దేశాన్ని చీకట్లోకి నెట్టాయనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

    దేశంలో 35 శాతం ప్రజలు ఒక్క పూట అన్నంతో కాలం గడుపుతున్నారన్న మంత్రి ఈ పాపానికి కారణం బిజెపి ప్రభుత్వ విధానాలే అన్నారు. ఆకలి, దరిద్రం పారద్రోలడమే బీఅర్‌ఎస్ లక్ష్యమని ఈ సందర్బంగా మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం సభను సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

    ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏమి వస్తది అని అడిగిన వారికి కంటి వెలుగే సమాధానం అన్నారు.. దేశంలో నే ఇటువంటి పథకం తెలంగాణలో మినహా ఎక్కడా లేదన్నారు. పేద ప్రజలకు పెద్ద కొడుకులా వైద్యం చేయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట కలెక్టర్ హేమంత్ పాటిల్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ లు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular