Nalgonda | Moosi విధాత: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయి కి చేరుకోవడంతో సోమవారం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం సోమవారం 644. 60 అడుగులకు నీటి నిలువ చేరుకుంది. ఎగువ నుంచి 243.16 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల మేరకు దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. జిల్లా మంత్రి జగదీష్ […]

Nalgonda | Moosi

విధాత: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయి కి చేరుకోవడంతో సోమవారం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.

ప్రాజెక్టు నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం సోమవారం 644. 60 అడుగులకు నీటి నిలువ చేరుకుంది.

ఎగువ నుంచి 243.16 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల మేరకు దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సూచనల మేరకు నీటి విడుదలకు నిర్ణయించారు. ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంలో డిఈ చంద్రశేఖర్ ఏఈలు ఉదయ్ కుమార్, మమత, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Updated On 6 Jun 2023 1:53 AM GMT
krs

krs

Next Story