HomelatestNalgonda | ప్రేమ వ్యవహారం.. కొప్పోలులో యువకుడి హత్య

Nalgonda | ప్రేమ వ్యవహారం.. కొప్పోలులో యువకుడి హత్య

Nalgonda |

విధాత: నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో ఓ యువకుడు హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. కట్టంగూరు మండలం దుగినేపల్లికి చెందిన బొడ్డు సంతోష్ కు నల్లగొండలో తనతో పాటు ఇంటర్ చదువుకున్న కొప్పొలు కు చెందిన బాలికతో గతంలో ప్రేమ వ్యవహారం సాగింది.

ఈ వివాదంలో ఇరువర్గాల తల్లిదండ్రులు గతంలో పంచాయతీ నిర్వహించి పరస్పరం ఒకరి జోలికి మరొకరు రావద్దంటూ తీర్మానించుకున్నారు. యువకుడు తన తల్లిదండ్రులతో పాటు సూరత్ కు కల్లు గీత వృత్తి నిమిత్తం వలస వెళ్లాడు.

గురువారం చండూరు మండలంలో తన బంధువుల ఇంటికి పండుగకు వచ్చిన యువకుడు సంతోష్ యువతీతో ఫోన్లో మాట్లాడగా, ఆమె పిలుపు మేరకు కొప్పల్ లోని ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇది గమనించిన యువతి నాయనమ్మ ఇంటికి గడియ వేసి కుటుంబ సభ్యులకు తెలిపింది.

వారు వచ్చి ఆవేశంతో యువకుడిని చితకబాదారు. దెబ్బలకు తాళలేక యువకుడు ప్రాణాలు విడిచాడు. యువతి నాయనమ్మ రాములమ్మ మాత్రం తానే యువకుడిని రోకలిబండతో కొడితే అతను చనిపోయినట్లుగా పోలీసులకు తెలిపింది.

అయితే యువతి కుటుంబ సభ్యులు సంతోష్ ను మాట్లాడుకుందాం రమ్మని నమ్మించి ఇంటికి పిలిచి హత్య చేశారని మృతుడి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

సంతోష్ హత్య పరువు హత్య అంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular