NALGONDA విధాత: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రేడియో డయాగ్నొస్టిక్ హబ్, రేడియాలజీ (రొమ్ము కాన్సర్), ఎక్స్ రే పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేడియో డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ […]

NALGONDA

విధాత: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రేడియో డయాగ్నొస్టిక్ హబ్, రేడియాలజీ (రొమ్ము కాన్సర్), ఎక్స్ రే పరికరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేడియో డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కటికం సత్తయ్య గౌడ్ ,
డి ఎం హెచ్ వో అనిమల్ల కొండల్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటిండెంట్ లచ్చు నాయక్, వైద్య కార్మికుల సంఘం పల్లా దేవేందర్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Updated On 10 May 2023 12:37 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story