Nalgonda విధాత: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టిన నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ (NCF)-2023 జాతీయ సమైక్యతకు గొడ్డలి పెట్టు లాంటిదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. అఖిలభారత ఉపాధ్యాయ ఉద్యమ జాతీయ నాయకులు, UTF పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దాచురి రామి రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా TSUTF రాష్ట్ర కమిటీ చేపట్టిన కుటుంబ సంక్షేమ నిధి(FWF) కార్యక్రమాన్ని నల్గొండలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. మతం మౌడ్య దేశాలలో మాదిరిగా […]

Nalgonda

విధాత: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టిన నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ (NCF)-2023 జాతీయ సమైక్యతకు గొడ్డలి పెట్టు లాంటిదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. అఖిలభారత ఉపాధ్యాయ ఉద్యమ జాతీయ నాయకులు, UTF పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దాచురి రామి రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా TSUTF రాష్ట్ర కమిటీ చేపట్టిన కుటుంబ సంక్షేమ నిధి(FWF) కార్యక్రమాన్ని నల్గొండలో ఆయన ప్రారంభించి మాట్లాడారు.

మతం మౌడ్య దేశాలలో మాదిరిగా పూర్వ ప్రాథమిక విద్య నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పూర్వకాలంలో ప్రాచీన భారతదేశంలో అవలంభించిన హిందూ వాదాన్ని చొప్పించాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. దేశ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తూ ఇతర మతాల రాజుల చరిత్రను పుస్తకాల నుండి చెరిపి వేస్తున్నారని, అందువల్ల రాబోవు తరాలకు వాస్తవాలు తెలియకుండా పోతాయని, ఇది జాతీయ సమైక్యతకు మంచిది కాదని తెలిపారు.

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ కుటుంబ సంక్షేమ నిధి (FWF) అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, దివంగత రామిరెడ్డి ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల సంక్షేమానికి ఒక విధానం ఉండాలని కోరుకునేవారని, వారి మేధస్సు నుండి పుట్టిన ఆలోచనే ఈ కుటుంబ సంక్షేమ నిధి కార్యక్రమమన్నారు. దీనిలో సంఘంలోని ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరి వివిధ కారణాల వలన మరణించిన సభ్యుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కుటుంబ సంక్షేమ నిధి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ కుటుంబ సంక్షేమ నిధి కార్యాలయం నల్లగొండలో ఉన్నా కూడా ఇది రాష్ట్ర కుటుంబ సంక్షేమ నిధి బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, సిహెచ్ దుర్గ భవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, STFI ఉపాధ్యక్షులు ఎం సంయుక్త , TAPRPA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ప్రధాన సంపాదకులు బి మాణిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు యం. రాజశేఖర్ రెడ్డి, జి.నాగమణి పాల్గొన్నారు.

Updated On 2 May 2023 4:05 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story