HomelatestPonguleti | Nalgondaలో పొంగులేటి..! వెలిమినేడు ఆలయంలో పూజలు.. వీరేశం, కృష్ణారెడ్డి అనుచరుల స్వాగతం?

Ponguleti | Nalgondaలో పొంగులేటి..! వెలిమినేడు ఆలయంలో పూజలు.. వీరేశం, కృష్ణారెడ్డి అనుచరుల స్వాగతం?

Ponguleti | Nalgonda

విధాత: బిఆర్ఎస్ తిరుగుబాటు నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఆదివారం ఆయన చిట్యాల మండలం వెలిమినేడు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటికీ బిఆర్ఎస్ కు చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడైన కంచర్ల కృష్ణారెడ్డిల అనుచరులుగా భావిస్తున్న స్థానిక నాయకులు కొందరు స్వాగతం పలికినట్లుగా తెలుస్తుంది.

అయితే పొంగులేటి రాకకు ముందే అప్పటికే అక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉన్న తమ వర్గీయులు కొందరు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారే తప్ప ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ మరోవైపు వీరేశం, కృష్ణారెడ్డిల వర్గీయులు స్పష్టం చేశారు.

బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా రాజకీయ చౌరస్తాలో ఉండి భవిష్యత్తు రాజకీయ లక్ష్యాల దిశగా కాంగ్రెస్, బిజెపిలలో ఏ పార్టీలోకి వెళ్లాలి.. లేక కొత్త పార్టీ పెట్టాలా.. అన్నదానిపై మల్లగుల్లలు పడుతున్నారు.

పొంగులేటితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అసంతృప్త బిఆర్ఎస్ నేతలు చకిలం అనిల్ కుమార్, వేముల వీరేశం, కంచర్ల కృష్ణారెడ్డిలు, కోదాడకు చెందిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి వంటి నేతలు టచ్ లో ఉన్నట్లుగా కొంత కాలంగా ప్రచారం నెలకొంది. ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా వెలిమినేడులో కొందరు వేముల, కృష్ణారెడ్డిల అనుచరులు, పొంగులేటి రాక సందర్భంగా ఆయనను కలవడం చర్చనీయాంశమైంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పొంగులేటి ఎక్కువ కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అటు బిజెపి కూడా ఖమ్మం జిల్లాలో బలంగా లేకపోవడంతో ఆ పార్టీలోకి వెళ్లడం కంటే కాంగ్రెస్ లోకి వెళితేనే బిఆర్ఎస్ ను దెబ్బతీయవచ్చన్న ఆలోచనకే పొంగులేటి మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం సాగుతుంది.

ఇదే సమయంలో కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఅర్ పిపి) పార్టీతో ఎన్నికల్లో అధికార బిజెపిని దెబ్బతీసినట్లుగా తాను కూడా తెలంగాణలో సొంత పార్టీ పెట్టి కనీసంగా 40 స్థానాలకు పైగా పోటీ చేసి ఇక్కడ అధికార బీఅర్ఎస్ ను దెబ్బతీయాలన్న ఆలోచన కూడా పొంగులేటి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

కాంగ్రెస్ లోకి వెళ్లాలా లేక కొత్త పార్టీ పెట్టాలా అన్న దానిపై చర్చించడంలో భాగంగానే ఆయన నల్గొండ జిల్లాలో తన వెంట వచ్చే బిఆర్ఎస్ అసంతృప్త నేతలతో టచ్ లో ఉన్నారని, అందుకే జిల్లా పర్యటనలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular