Nalgonda
విధాత: నాగార్జునసాగర్‌ను గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని కుటుంబ సమేతంగా సందర్శించారు. విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న న్యాయమూర్తికి నల్గొండ జిల్లా న్యాయమూర్తి నాగరాజు, మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య, పెద్దవూర తాసిల్దార్ సైదులు, డిప్యూటీ తాసిల్దార్ శరత్‌చంద్ర, సాగర్ సీఐ బీసన్న, ఎస్ఐ సురేష్, నల్గొండ జ్యుడిషరీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు వీరబాబు ఘనంగా స్వా గతం పలికారు.
పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నాగార్జునకొండ మ్యూజియాన్ని బుద్ధ వనాన్ని సందర్శించారు. వీరికి టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునకొండ చారిత్రక విశేషాలను, బుద్ధ వనం వివరాలను తెలియజేశారు. వీటితోపాటు కోర్టు సిబ్బంది అంజయ్య, కాలిక్, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.