Homeతెలంగాణ‌Nalgonda | నిరుద్యోగులు.. స్టడీ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి జగదీష్‌రెడ్డి

Nalgonda | నిరుద్యోగులు.. స్టడీ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి జగదీష్‌రెడ్డి

Nalgonda

విధాత: నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో డి.పి.ఆర్.సి భవనము (మహిళ ప్రాంగణము) నందు జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ ను మంత్రి జి. జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్న క్రమంలో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రంధాలయాలు, స్టడీ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

నిరుద్యోగుల కోసం జడ్పీ చైర్మన్ బండ చొరవ తీసుకొని స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిరుద్యోగులు స్టడీ సెంటర్ సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షలను నెగ్గేందుకు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రవీంద్ర కుమార్, భాస్కరరావు, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular