విధాత,అమరావతి: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా మండి పడ్డారు. పేర్లు మార్చడం ద్వారా పాలకులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్‌ పేరు బదులు వైఎస్‌ఆర్ పేరు పెడితే వర్సిటీలో వసతులు మెరుగవుతాయా? విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థంలేని చర్య’ అని పేర్కొన్నారు. కొత్త వివాదాలు సృష్టించేందుకే వైకాపా ప్రభుత్వం ఈ పని చేసిందని ధ్వజమెత్తారు. పేర్లు మార్చాలనుకునే వారు విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి […]

విధాత,అమరావతి: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా మండి పడ్డారు.

పేర్లు మార్చడం ద్వారా పాలకులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్‌ పేరు బదులు వైఎస్‌ఆర్ పేరు పెడితే వర్సిటీలో వసతులు మెరుగవుతాయా? విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థంలేని చర్య’ అని పేర్కొన్నారు.

కొత్త వివాదాలు సృష్టించేందుకే వైకాపా ప్రభుత్వం ఈ పని చేసిందని ధ్వజమెత్తారు. పేర్లు మార్చాలనుకునే వారు విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి పేరు మార్చవచ్చు కదా అని నిలదీశారు.

Updated On 21 Sep 2022 2:43 PM GMT
krs

krs

Next Story