HomelatestNandi Awards | దత్తు అలా.. పోసాని ఇలా.. వారిద్దరిపై నట్టి కుమార్ వెర్షన్ ఇది

Nandi Awards | దత్తు అలా.. పోసాని ఇలా.. వారిద్దరిపై నట్టి కుమార్ వెర్షన్ ఇది

Nandi Awards

విధాత: ఇటీవల నంది అవార్డుల(Nandi Awards) విషయంలో నిర్మాత అశ్వనీదత్ వైసీపీని విమర్శిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమా అవార్డులు మానేసి రౌడీ, గూండా అవార్డులు ఇచ్చుకుంటున్నారనేలా ఆయన మాట్లాడిన మాటలకు ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని ఫైర్ అయ్యారు.

టీడీపీని వెనకేసుకొస్తూ అశ్వనీదత్ మాట్లాడటం ఏం బాగాలేదని ఆయన మండి పడ్డారు. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు అవి కదా ఇవ్వాల్సిన అవార్డులు. ఉత్తమ వెధవలు, ఉత్తన సన్యాసులు అని మీ వాళ్ళకే ఇవ్వాలి అంటూ.. కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడీ అవార్డులపై నిర్మాత నట్టికుమార్ మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేశారు.

సినిమా రంగంలో అనేక ప్రైవేట్ అవార్డులు వచ్చేయడంతో అవార్డులకు ఉన్న విలువలు పడిపోతున్నాయని నిర్మాత నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారని, అయితే ఆ అవార్డులను ఇవ్వడం కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి మరచిపోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 2014 తర్వాత నుంచి ఇంతవరకు అసలు ఇవ్వలేదని చెప్పారు.

ఇక ఏపీకి సంబంధించి లోగడ టీడీపీ ప్రభుత్వం రెండేళ్లకు కలిపి ఇచ్చిన నంది అవార్డులపై విమర్శలు కూడా వచ్చాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా వల్ల ఇబ్బందులు ఎదురు కావడంతో వాళ్లు ఇవ్వడానికి వీలు కాలేదని, దానిని కొంతమంది పనికట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

నా ఉద్దేశ్యం ప్రకారం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వారు కూర్చుని, నంది అవార్డులపై అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే బావుంటుందని తెలిపారు. ఇటీవల అవార్డుల విషయంపై సీనియర్ నిర్మాత దత్తు గారు, ఏపీ ఎఫ్.డి.సి. చైర్మన్ పోసాని గారు మాట్లాడిన మాటలు సమర్థనీయం కావని అన్నారు.

దత్తుగారు టీడీపీ తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడితే, ఆ తర్వాతే పోసాని మాట్లాడారని అన్నారు. అయినా సినిమా రంగం విషయంలో పార్టీల కతీతంగా వ్యవహరించాలని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular