విధాత: తెలుగులో నేచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిభావంతుడైన నటుడు. శ్యామ్ సింగరాయ వంటి హిట్ తరువాత ఆయన నటించిన అంటే సుందరానికి చిత్రం పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన లుక్ రంగస్థలం లోని రామ్ చరణ్, పుష్పాలోని అల్లు అర్జున్ లను పోలి ఉంది. దాంతో నాని లుక్ పై ట్రోల్స్ వస్తున్నాయి. రగ్గ్డ్ లుక్ […]
విధాత: తెలుగులో నేచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిభావంతుడైన నటుడు. శ్యామ్ సింగరాయ వంటి హిట్ తరువాత ఆయన నటించిన అంటే సుందరానికి చిత్రం పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన లుక్ రంగస్థలం లోని రామ్ చరణ్, పుష్పాలోని అల్లు అర్జున్ లను పోలి ఉంది.
దాంతో నాని లుక్ పై ట్రోల్స్ వస్తున్నాయి. రగ్గ్డ్ లుక్ లో నాని చాలా బాగా ఉన్నప్పటికీ రంగస్థలం, పుష్పాల పోలికలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని నాని పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలో విడుదల చేయనున్నారు. మార్చి 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
గోదావరిఖని సింగరేణి బ్యాక్ డ్రాప్ లో స్నేహం, ప్రేమ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది అని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రానుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది నిజం కాదని సమాచారం. దసరా చిత్రం ఒకే పార్ట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం నాని లుక్స్ పరంగా యాస పరంగా ఎంతో కష్టపడ్డారు.
ఈ లుక్ కోసం నాని ఎంతో కష్టాన్ని భరించాడని అంటున్నారు. ఆయన పోస్టర్లను చూస్తే ఆ విషయంఅర్థమవుతుంది. ఇక సింగరేణి బ్యాక్ డ్రాప్ అంటే తెలంగాణ యాసలో మాట్లాడాలి. దానికోసం తెలంగాణ యాసను ఏరి కోరి మరి ఎంతో కష్టపడి నాని నేర్చుకున్నాడట. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఎంసీఏ తర్వాత నాని -కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం ఇది.