విధాత, సినిమా: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ తర్వాత ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు.
అయితే నటుడుగానే కాకుండా వివాదాల రూపంలో కూడా ఆయన హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. ఆయన 3 పెళ్లిళ్లు చేసుకుని.. మూడు సార్లు విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం నాలుగో వివాహం చేసుకోబోతున్నట్టు గత ఏడాది డిసెంబర్ 31న అధికారికంగా ప్రకటించాడు.
అయితే మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల మ్యాటర్ ఇంకా పెండింగ్‌లో ఉండటంతో.. నరేష్ నాలుగో పెళ్లి విషయమై ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉంది. మూడో భార్య విడాకులకు అంగీకరించడం లేదు.. ఎందుకంటే నరేష్, పవిత్ర పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు.
నరేష్‌కి, తనకు పుట్టిన కుమారుడు తన తండ్రి కావాలని కోరుకుంటున్నాడని, కాబట్టి నరేష్‌కి విడాకులు ఇవ్వడానికి ఆమె సంసిద్దంగా లేనని ఖరాఖండీగా చెప్పేస్తుంది. అతనికి తండ్రి అవసరం ఉందని చెప్పుకొచ్చింది.
ఇక నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నట్టు లిప్‌లాక్ పెట్టుకొని మరీ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? అది రమ్యని ఇంకా ఇంకా రెచ్చగొట్టడానికి అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో.. త్వరలో మీతో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాను అని చెప్తున్నాడు నరేష్.
ఆ గుడ్ న్యూస్ పెళ్లికి సంబంధించినదా? లేక తాను నటిస్తున్న చిత్రానికి సంబంధించినదా? అనేది తేలాల్సివుంది. కాగా ప్రస్తుతం నరేష్ పవిత్రలు ప్రధాన పాత్రలలో ఎంఎస్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం పొందుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నరేష్ గుడ్ న్యూస్ అంటూ కామెంట్ చేస్తున్నారని.. అంతకు మించి వివాహానికి సంబంధించిన అప్డేట్ అయితే కాదని అర్థమవుతోంది.