విధాత: సీనియర్ నరేష్.. ‘సీనియర్ నటి విజయనిర్మల మొదటి భర్తకు కలిగిన కుమారుడు. ఈయన 1972లో పండంటి కాపురం అనే చిత్రం ద్వారా బాలనటునిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఇతని తల్లి విజయనిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్లు చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం భళారే విచిత్రం, జంబలకడిపంబ వంటి హాస్య చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
అయితే నరేష్ ఎప్పుడు వివాదాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో శివాజీ రాజా మీద గెలుపొందాడు. తర్వాత ఇటీవల మంచు విష్ణు నిలబడ్డప్పుడు ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈయనకు ఇప్పటివరకు మూడు వివాహాలు జరిగాయి.
మొదటిగా సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించాడు. అదే నవీన్ బాబును ఇటీవల ఓ చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆమెతో మనస్పర్ధల కారణంగా విడిపోయి రెండో పెళ్లి చేసుకోగా ఆమెతోను విడాకులు చేసుకున్నారు.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
అనంతరం 2010 డిసెంబర్ 3న హిందూపురంలో 50 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు కూడా ఉండగా ఆమెతోను విడాకుల పంచాయతీ నడుస్తుంది. త్వరలో 62వ ఏట నుంచి 63వ వడిలోకి అడుగు పెట్టబోతున్న సమయంలో ఈయన నాలుగో వివాహానికి సిద్ధమయ్యాడు. కన్నడ నటిగా పరిచయమైన పవిత్ర లోకేష్ ను ఆయన వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించాడు.
ఇటీవల వీరిద్దరూ ఒక హోటల్ రూమ్‌లో దొరకడం, మాజీ భార్య వచ్చి నానా హంగామా చేయడం ఇదంతా అందరికీ తెలిసిందే. పవిత్ర లోకేష్ సినిమాల్లోనే కాదు టీవీలలో కూడా నటించింది. కన్నడ, తెలుగు చిత్రాలలో చేసింది. తెలుగులో కూడా ఈమెకు హీరో హీరోయిన్ల తల్లిగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చాలా వచ్చాయి. ఎన్నో తెలుగు తమిళ, కన్నడ చిత్రాల్లో ఈమె నటించింది. ఒక్క కన్నడంలోనే 150 చిత్రాల్లో నటించింది. ఈమె తండ్రి మైసూర్ లోకేష్ కూడా నటుడే. ఆల్రెడీ సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో ఈమెకు వివాహం జరిగింది. 2018లో వీరు విడిపోయారు. వీరికి ఒక బాబు ఒక పాప ఉన్నారు.
ఇక తాజాగా నరేష్ మాట్లాడుతూ నేను పవిత్ర లోకేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నామని తెలిపారు. తన స్నేహితురాలు పవిత్రతో వివాహం త్వరలో చేసుకోబోతున్నానని ఈ మేరకు శనివారం ఉదయం ఆయన ఓ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. కొత్త సంవత్సరం.. కొత్త ఆరంభాలు.. మీ అందరి ఆశీస్సులు కావాలి… మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు.
దాంతోపాటు పవిత్ర నరేష్ అనే హ్యాష్ ట్యాగ్‌ను దీనికి జత చేశారు. నరేష్ ఎంతోకాలంగా తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉన్నారు. పవిత్ర సైతం తన భర్తకు దూరంగా జీవిస్తోంది. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో కలిసిన నటించిన విషయం కూడా తెలిసిందే. మొత్తానికి షష్టి పూర్తి వయసు దాటిన తర్వాత నాలుగో పెళ్లి చేసుకోబోతున్న నరేష్ ను చూసి కొందరు నిత్య పెళ్లి కొడుకు అంటుంటే మరికొందరు ముసలోడికి దసరా పండగ అంటే ఇదే అంటూ సెటైర్లు వేస్తున్నారు.