తెలంగాణకు ఏం చేశారంటూ ప్రశ్న శాపంగా మారారంటూ విమర్శలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(Kishan Reddy)కి నర్సంపేట(Narsampeta) ఎమ్మెల్యే(MLA) పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) గురువారం బహిరంగ లేఖ(Letter) రాశారు. లేఖలో వివరాలిలా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ బాధ్యత మరిచి చిల్లర విమర్శలకే పరిమితమయ్యారు తప్ప, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయలేదు. మీరు అసమర్థులు.. ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన‌ట్టుగా, కేంద్రమంత్రిగా […]

  • తెలంగాణకు ఏం చేశారంటూ ప్రశ్న
  • శాపంగా మారారంటూ విమర్శలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(Kishan Reddy)కి నర్సంపేట(Narsampeta) ఎమ్మెల్యే(MLA) పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) గురువారం బహిరంగ లేఖ(Letter) రాశారు. లేఖలో వివరాలిలా ఉన్నాయి.

తెలంగాణా రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ బాధ్యత మరిచి చిల్లర విమర్శలకే పరిమితమయ్యారు తప్ప, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయలేదు.

మీరు అసమర్థులు..

ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన‌ట్టుగా, కేంద్రమంత్రిగా తెలంగాణాకు ఒక్క రూపాయి తేలేక అసమర్థునిగా మిగిలిపోతున్నారు.

గోదావరి వరదల సమయంలో 1000 కోట్ల సహాయాన్ని అడిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదు. హైదరాబాద్ లో వరదలొస్తే అర్ధ రూపాయి సాయం చేయలేదు.

వడగండ్లు పడితే ఆదుకోలేదు

వరంగల్ జిల్లాలో గత ఏడాది వడగండ్ల వానతో నష్టపోతే, రాష్ట్రం రైతులకు ఇన్ పుడ్ సబ్సిడీ అందించి ఆదుకున్నారు. కేంద్రం సాయం చేయలేదు. తెలంగాణకు ప్రతీ విషయంలో మొండిచెయ్యి చూపుతున్నారు.

కేంద్రం పక్షపాత ధోరణి

బీజేపీ పాలిత, ఎన్నికలున్న ఐదు రాష్ట్రాలకు రూ.1,816.16కోట్లను ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద కేటాయించింది మోదీ సర్కారు.. గోదావరి వరదసాయం చేయాలని సర్కారు కేంద్రాన్ని అడిగింది.. ఒక్కరూపాయి మంజూరు చేయకుండా కర్ణాటక రాష్ట్రానికి రూ..941.04కోట్లు, మేఘాలయ రాష్ట్రానికి రూ.47.33కోట్లు,అస్సాం కు 520.466కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కు 239.31కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ పై బీజేపీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుంది.

శాపంగా మారిన కిషన్‌ రెడ్డి

మీ చేతగానితనం తెలంగాణకు శాపంగా మారింది. రావాల్సిన నిధుల్లో అన్యాయం, హక్కుగా రావాల్సిన వాటాలపై కేంద్రాన్ని అడగడం చేతకాదన్నారు. మీ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొడుతుందన్నారు.

ఇట్లు.
- పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట శాసనసభ్యుడు

Updated On 16 March 2023 3:10 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story