jupiter | విధాత: సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహంపై మరోసారి ఫ్లాష్ లైట్ మాదిరిగా కాంతిపుంజం కనిపించడం ఖగోళ పరిశోధకులలో ఆసక్తిరేపింది. ముందెన్నడు ఖగోళ పరిశోధకులు చూడని విధంగా కాంతిపుంజం కనిపిస్తుండగా దీనిని ఆగస్టు 28న గుర్తించారు.గతంలో సైతం అంతరిక్ష వస్తువులు, తోక చుక్కలు గురుగ్రహంలో కూలిపోవడంతో భారీ వెలుగులు కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. గురుగ్రహం భూమితో పాటు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను ఆస్ట్రాయిడ్స్‌ల నుంచి పరిరిక్షిస్తుంది. గురుగ్రహానికి దగ్గరగా అస్ట్రాయిడ్ బెల్డ్ ఉంటుందని, దీనిని […]

jupiter |
విధాత: సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహంపై మరోసారి ఫ్లాష్ లైట్ మాదిరిగా కాంతిపుంజం కనిపించడం ఖగోళ పరిశోధకులలో ఆసక్తిరేపింది. ముందెన్నడు ఖగోళ పరిశోధకులు చూడని విధంగా కాంతిపుంజం కనిపిస్తుండగా దీనిని ఆగస్టు 28న గుర్తించారు.గతంలో సైతం అంతరిక్ష వస్తువులు, తోక చుక్కలు గురుగ్రహంలో కూలిపోవడంతో భారీ వెలుగులు కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు.
గురుగ్రహం భూమితో పాటు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను ఆస్ట్రాయిడ్స్‌ల నుంచి పరిరిక్షిస్తుంది. గురుగ్రహానికి దగ్గరగా అస్ట్రాయిడ్ బెల్డ్ ఉంటుందని, దీనిని దాటే తోక చుక్కలు, గ్రహశకలాలు గురుత్వాకర్షణ ప్రభావంతో గురుగ్రహాన్ని ఢీ కొట్టిన సందర్భాల్లో అలాంటి ఫ్లాష్ వెలుగులు కనిపిస్తుంటాయని కథనం.
గురుగ్రహం లేకుంటే ఆస్ట్రాయిడ్స్ బెల్డ్‌లోని గ్రహశకలాలు దారితప్పి నేరుగా భూగ్రహంపైకి దూసుకొచ్చే ప్రమాదముంది. తాజాగా బృహస్పతి గురుత్వాకర్షణ శక్తికి గురైన ఓ వస్తువు గురు గ్రహ వాతావరణంలో పడిపోయిందని, ఆ వెలుగునే కాంతిపుంజం లేక ఫ్లాష్ లైట్‌గా కనిపిస్తుందని క్యూటో విశ్వవిద్యాలయం ఖగోళ పరిశోధకులు ఆరిమాట్సు వెల్లడించారు.
సౌర వ్యవస్థ పరిశోధనలకు, అవగాహానలకు ఈ కాంతిపుంజలు దోహదం చేస్తాయన్నారు. గతంలో 2010 నుంచి గురు గ్రహంపై 9 మెరుపులలో 8 మెరుపులు ఇదే రకంగా కనిపించాయని, 1994లో షూమేకర్ లేవి 9 -అనే తోకచుక్క బృహస్పతిని ఢీ కొట్టిన సందర్భంలోనూ ఇలాగే మెరుపు కనిపించిందని తెలిపారు.
