SUN | కాలంలో వెన‌క్కు వెళ్లి.. అప్ప‌టి విశ్వం గురించి తెలుసుకునేందుకు నాసా (NASA) జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ (James Web Telescope) ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అనేక విశ్వ ర‌హ‌స్యాల గుట్టు విప్పిన ఈ టెలిస్కోప్.. తాజాగా ఒక న‌క్ష‌త్రం ఏర్ప‌డుతున్నప్ప‌టి చిత్రాన్ని ఫొటో తీసి నాసాకు పంపిం చింది. మ‌న సూర్యుడు కూడా ఒక‌ప్పుడు ఇలానే ఏర్ప‌డి ఉంటాడ‌ని పేర్కొంటూ నాసా ఈ ఫొటోను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుంది. ఈ ఫొటోలో […]

SUN |

కాలంలో వెన‌క్కు వెళ్లి.. అప్ప‌టి విశ్వం గురించి తెలుసుకునేందుకు నాసా (NASA) జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ (James Web Telescope) ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అనేక విశ్వ ర‌హ‌స్యాల గుట్టు విప్పిన ఈ టెలిస్కోప్.. తాజాగా ఒక న‌క్ష‌త్రం ఏర్ప‌డుతున్నప్ప‌టి చిత్రాన్ని ఫొటో తీసి నాసాకు పంపిం చింది. మ‌న సూర్యుడు కూడా ఒక‌ప్పుడు ఇలానే ఏర్ప‌డి ఉంటాడ‌ని పేర్కొంటూ నాసా ఈ ఫొటోను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుంది.

ఈ ఫొటోలో ఉన్న వ‌స్తువుని హెర్బిబ్ హారో ఆబ్జెక్ట్స్ అంటార‌ని తెలిపింది. మ‌న‌కు 1000 కాంతి సంవ‌త్సరాల దూరంలో ఈ ఖ‌గోళ అద్భుతం జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించింది. హెర్బిగ్ హారో 211 అని నాసా దీనికి పేరు పెట్టింది. 'మ‌నం ఒక వేళ సూర్యుడు పుడుతున్న‌పుడు ఫొటో తీస్తే అది ఇలానే ఉంటుంది. ఒక చిన్న ఖ‌గోళ వ‌స్తువు త‌న ధ్రువాల నుంచి వాయువుల‌ను వెద‌జ‌ల్లుతున్న‌పుడు తీసిన చిత్రం ఇది.

ప్ర‌స్తుతం దీని వ‌య‌సు కేవ‌లం వేల‌లోనే ఉంటుంది. కాలం పెరిగేగొద్దీ ఒక స‌మ‌యంలో ఇది మ‌న సూర్యునిలా రూపు దాలుస్తుంది' అని నాసా పేర్కొంది. ఇలా ప‌దులు లేదా వేల వ‌య‌సున్న శిశు న‌క్ష‌త్రాల‌ను క్లాస్ 0 ప్రొటోస్టార్‌ల‌ని పిలుస్తారు. ఇవి కేవలం ప‌దుల నుంచి వెయ్యేళ్ల వ‌యసుతో మాత్ర‌మే ఉంటాయి.

ఈ ప్రొటోస్టార్‌ల ద్ర‌వ్య‌రాశి మ‌న సూర్యుని ద్ర‌వ్య‌రాశిలో 8 శాతం మాత్ర‌మే ఉంటుంది. ప్ర‌స్తుతం హెర్బిగో హారో 211 వెద‌జల్లుతున్న వాయువుల్లో సిలికాన్ మోనాక్సైడ్‌, మాలిక్యుల‌ర్ హైడ్రోజ‌న్‌, కార్బ‌న్ మోనాక్సైడ్లు పెద్ద మొత్తంలో ఉండ‌టం వ‌ల్ల ఇన్‌ఫ్రారెడ్ కాంతి పుంజాలు ఏర్ప‌డుతున్నాయి. వాటిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గ్ర‌హించి ఫొటోను తీయ‌గ‌లిగింది.

View this post on Instagram

A post shared by NASA (@nasa)

Updated On 20 Sep 2023 2:00 PM GMT
krs

krs

Next Story