విధాత, సినిమా: ఏమండోయ్.. ఇది విన్నారా? నిన్నటి వరకు నయన్, విఘ్నేష్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని చెప్పిన తమిళ నాడు ప్రభుత్వం.. తాజాగా వారి తప్పేం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా కాకుండానే వారికి ఇద్దరు పిల్లలు కలగడంపై తమిళ నాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. వివరణ ఇవ్వాలంటూ.. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఓ 10, 15 […]

విధాత, సినిమా: ఏమండోయ్.. ఇది విన్నారా? నిన్నటి వరకు నయన్, విఘ్నేష్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని చెప్పిన తమిళ నాడు ప్రభుత్వం.. తాజాగా వారి తప్పేం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా కాకుండానే వారికి ఇద్దరు పిల్లలు కలగడంపై తమిళ నాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. వివరణ ఇవ్వాలంటూ.. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ ఓ 10, 15 రోజుల పాటు కష్టపడి ఇచ్చిన రిపోర్ట్‌లో.. వారిద్దరూ సరొగసి కోసం ICMR మార్గదర్శకాలను అనుసరించినట్లుగా ఉందని, వారేం తప్పు చేయలేదని.. తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది.

దీంతో నయన్, విక్కీలకు భారీ ఊరట లభించగా.. ఇదంతా చూస్తున్న వారికి మాత్రం ఇదేదో పెద్ద గ్యాంబ్లింగ్ మాదిరిగా అనిపిస్తుందనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరమే లేదు. అందుకే అంటుంటారు డబ్బులుంటే.. ఇవాళ ఏ పనైనా జరుగుతుందనేది.

ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. నయన్, విఘ్నేష్ శివన్‌లకు ఆరేళ్ల క్రితమే వివాహం అయిందట. రిజిస్టర్ మ్యారేజ్‌కు సంబంధించి ధృవ పత్రం కూడా సమర్పించినట్లుగా తెలుస్తుంది. గత ఏడాది డిసెంబర్‌లో సరొగసీ విధానాన్ని అనుసరించారని, దీని కోసం వారు అన్ని ఫార్మాలిటీస్‌ను సక్రమంగానే ఫాలో అయ్యారని నివేదికలో తెలిపారు.

మరి ఇవన్నీ సక్రమంగా జరిగితే.. నివేదిక కోసం కమిటీ వేయాల్సిన అవసరం ఏమోచ్చిందనే దాని పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ఇటువంటివి అన్ని అనుమతులు తీసుకునే చేశామని వారు చెబుతున్నారు.

అనుమతులు తీసుకున్న తర్వాత కూడా ప్రభుత్వం.. ఇదెలా జరిగిందో వివరణ ఇవ్వాలంటూ ఓ కమిటీ వేయడం ఏమిటో వారికే తెలియాలి. ఇదంతా చూస్తుంటే ఎవరో.. ఎవరికో చాలా సపోర్ట్ ఇస్తున్నట్లుగా అయితే అనిపిస్తుంది. సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి హీరోగా చేసిన సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది.

View this post on Instagram

A post shared by Nayanthara (@nayantthara)

అదే ఇప్పుడు అన్నీ చేసుకుంటూ వెళ్లిపోతుందనేలా కోలీవుడ్‌లో ఓ వర్గం మాట్లాడుకుంటుండటం విశేషం. ఇక క్లీన్ చిట్ వచ్చేసింది కాబట్టి.. నయన్, విఘ్నేష్ దంపతులు, వారి అభిమానులు కూడా హ్యాపీ. ఇంతకుముందు ఇలాంటి విషయాలలో ఇరుక్కుపోయిన వారు మాత్రం అన్ హ్యాపీ. ఎందుకని మాత్రం అడగవద్దు.. అర్థం చేసుకోవాలంతే.

Updated On 27 Oct 2022 4:16 AM GMT
Somu

Somu

Next Story