MEGA157 | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచారు. ఇటీవల వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ఇంతకు ముందు భోళాశంకర్, ఆచార్య సినిమాల్లో నటించగా.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయాయి. తమిళంలో హిట్‌గా నిలిచిన చిత్రాలను రీమేక్ చేశారు. తెలుగు మాత్రం అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారు. పుట్టిన రోజు సందర్భంగా రెండు చిత్రాలను చేయనున్నట్లు […]

MEGA157 | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచారు. ఇటీవల వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ఇంతకు ముందు భోళాశంకర్, ఆచార్య సినిమాల్లో నటించగా.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయాయి. తమిళంలో హిట్‌గా నిలిచిన చిత్రాలను రీమేక్ చేశారు. తెలుగు మాత్రం అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారు. పుట్టిన రోజు సందర్భంగా రెండు చిత్రాలను చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒకటి మెగా 127 (Mega 157). ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మించనుండగా.. బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించనున్నారు.
ఇప్పటికే పోస్టర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పంచభూతాల కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుట్లు తెలుస్తున్నది. మరో వైపు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సినిమా బేకర్స్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం నయనతారను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నయన్ ఇటీవల ‘జవాన్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగా.. బాలీవుడ్‌లోకి లేడి మెగాస్టార్‌కు గ్రాండ్ వెల్కమ్ దక్కిన్నట్లయ్యింది. ఇప్పటి వరకు కేవలం దక్షిణాది చిత్రాలకే పరిమితమైన నయన్ ‘జవాన్’తో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది.
ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ‘మెగా157’ చిత్రంలో కీలక పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నట్లుగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. మరి మెగాస్టార్ సినిమాలో నటించేందుకు లేడి మెగాస్టార్ ఒప్పుకుంటుందా ? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. నయన్‌కు ఆఫర్ చేసిన పాత్ర ఏంటీ ? హీరోయిన్‌గా తీసుకుంటున్నారా ? తెలియాల్సి ఉంది. బింబిసారతో సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకున్న డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్‌తో మంచి కంటెంట్‌తోనే చిత్రం తీయబోతున్నారని తెలుస్తున్నది. అయితే, నవంబర్ నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని, ఆ తర్వాత కంటిన్యూగా షూట్ చేయాలని భావిస్తున్నట్లు టాక్. 2024లో వేసవిలో థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు టాక్. ఇక ఈ చిత్రానికి ‘ఆస్కార్’ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
