Ned Price | అమెరికా (America) విదేశాంగ శాఖ ప్రతినిధి (State Department spokesperson) పదవికి రాజీనామా చేస్తున్నట్లు నెడ్ ప్రైస్ (Ned Price) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసినా.. ఈ నెల చివరి వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. నెడ్ ప్రైస్ గత రెండేళ్లుగా అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా నెడ్ ప్రైస్ సేవలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రశంసించారు.
నెడ్ ప్రైస్ వృత్తి నైపుణ్యం, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాడన్నారు. అతను చేసిన విశేషమైన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. 200 కంటే ఎక్కువ బ్రీఫింగ్‌లలో నెడ్ ప్రైస్ పాల్గొన్నారని, రిపోర్టర్లు, సహోద్యోగులు, అందరితో గౌరవంగా ప్రవర్తించారని కొనియాడారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో నిలిపివేసిన ప్రెస్ బ్రీఫింగ్‌ను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
నెడ్ ప్రైస్ 20 జనవరి, 2021 నుంచి స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి పదవిలో కొనసాగుతున్నారు. అయితే, ఆయన స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారన్న తెలియరాలేదు. నెడ్ ప్రైస్ ఇంతకు ముందు జాతీయ భద్రతా మండలిలో పని చేశారు. 2017 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. ఆ సమయంలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌ను విమర్శించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థపై చేసిన విమర్శలతో ఆయన ట్రంప్‌కు సేవ చేయలేనని ప్రకటించారు. ఒబామా పరిపాలనలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ప్రతినిధిగా సేవలందించారు.