విధాత: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని ఖాట్మండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్ వే పై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 72 మంది ఉన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు, 15 మంది విదేశీయులు ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్టు సమాచారం. ఈ క్రమంలో […]

విధాత: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని ఖాట్మండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్ వే పై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 72 మంది ఉన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు, 15 మంది విదేశీయులు ఉన్నారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇదే విమానానికి సంబంధించినదిగా చెప్పు బడుతున్న వీడియో ఒకట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు గాలిలో నియంత్రణ కోల్పోయి వేగంగా కింద పడిపోతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తున్నది. ఆ తర్వాత పెద్ద శబ్దం వినిపించింది.
నేపాల్: రన్ వే పై కూలిన విమానం.. 68 మంది మృతి https://t.co/0J2oLvfJpV nepal plane crash #aerowanderer #aviation #avgeek #nepal #yetiairlines pic.twitter.com/SybRcvdoT6
— vidhaathanews (@vidhaathanews) January 15, 2023
ప్రమాద నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం సంతాప దినంగా ప్రకటించింది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలుసుకోవడానికి నేపాల్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదం నుంచి ఎవరైనా బైటపడినారా? అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదని యతి ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు.
