HomelatestPathuThala | చెన్నై రోహిణి థియేటర్ నిర్వాకం.. టికెట్‌ ఉన్నా సంచార జాతి వారిని సినిమాకు...

PathuThala | చెన్నై రోహిణి థియేటర్ నిర్వాకం.. టికెట్‌ ఉన్నా సంచార జాతి వారిని సినిమాకు అనుమతించని వైనం

విధాత: చెన్నై చెన్నై రోహిణి థియేటర్ యాజమాన్యం సంచార జాతికి చెందిన ప్రేక్షకులను థియేటర్లోకి అనుమతించని వైనం తమిళనాడు రాష్ట్రంలో కలకలం రేపుతుంది శింబు నటించిన పతుతలాసినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్‌కు వచ్చిన సంచార జాతి వారిని టికెట్ కొన్నప్పటికీ సిబ్బంది లోనికి అనుమతించలేదు.

టికెట్ ఉందని ప్రాధేయపడినప్పటికీ, తోటి ప్రేక్షకులు చెప్పినప్పటికి కూడా థియేటర్ సిబ్బంది, యాజమాన్యం పట్టించుకోకుండా వారిని థియేటర్లోకి అనుమతించలేదు.

సంచార జాతుల ప్రేక్షకుల పట్ల థియేటర్ యాజమాన్యం సిబ్బంది జాతీ వివక్షత ప్రదర్శించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శింబు నటించిన పతుతాల సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు తమిళనాట వైరల్‌గా మారిపోయింది.

అయితే ఈ విషయమై అక్కడికి వచ్చిన ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావడం, సోషల్‌ మీడియాలో వీపరీతంగా వైరల్‌ కావడంతో విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దాంతో వారు ఆ సంచార జాతి వారిని సినిమా హలులోకి అనుమతించారు. ఈ మేరక థియేటర్‌ యాజమాన్యం ఓ లెటర్‌ విడుదల చేసింది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular