మద్య నిషేధాన్ని లైట్ తీసుకో మామా! జాడలేని ఏటా పావు వంతు మూత విధాత: లిక్కర్ షాపులు మూసేస్తాం.. మెల్లగా ఐదో ఏటకు మొత్తం షాపులు మూసేసి, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశాక మళ్లీ ఎన్నికలకు వెళ్తాం.. గ్రామాల్లో బెల్ట్ షాపుల ఉనికి లేకుండా చేస్తాం.. అప్పుడే మళ్లీ ఓట్లు అడుగుతాం… ఇదీ గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ. సీన్ రివర్స్.. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆదాయం.. ఖర్చులు లెక్కలు చూసేసరికి సీన్ రివర్స్ […]

- మద్య నిషేధాన్ని లైట్ తీసుకో మామా!
- జాడలేని ఏటా పావు వంతు మూత
విధాత: లిక్కర్ షాపులు మూసేస్తాం.. మెల్లగా ఐదో ఏటకు మొత్తం షాపులు మూసేసి, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశాక మళ్లీ ఎన్నికలకు వెళ్తాం.. గ్రామాల్లో బెల్ట్ షాపుల ఉనికి లేకుండా చేస్తాం.. అప్పుడే మళ్లీ ఓట్లు అడుగుతాం… ఇదీ
గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ.
సీన్ రివర్స్..
అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆదాయం.. ఖర్చులు లెక్కలు చూసేసరికి సీన్ రివర్స్ అయింది. మద్యం లేకుంటే రాష్ట్ర ఆదాయం సగం తగ్గిపోతుందని, ప్రభుత్వం నడవడం కష్టం అని అర్థం అయింది. దీంతో మొక్కుబడిగా కొన్ని షాపులు తగ్గించి మద్యం వ్యాపారం అంతా ప్రభుత్వం పరిధిలోకి తెచ్చి ఆదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
కొత్తగా మరో 10
గతంలో ని పాపులర్ బ్రాండ్స్ బీర్లు, లిక్కర్ లేకుండా చేసి కొత్తగా ఏవేవో నాసిరకం మద్యాన్ని తెచ్చి భారీ రేట్లకు అమ్ముతూ వస్తున్నారు. అయితే జగన్ తన సొంత బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ డబ్బు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తినా ప్రభుత్వం లెక్క చేయలేదు. అంతేకాదు కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.
ధర పెంచడానికేనా..
ప్రస్తుతం కొన్ని కేటగిరిలో బీరు బాటిల్ రూ.200 ఉంటే.. ఇప్పుడు అదే కేటగిరిలో కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ బీరు ధర రూ.220 గా చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ.110. కాగా.. కొత్తగా అనుమతి పొందిన మద్యం క్వార్టర్ ధర రూ.130గా ఉండటం గమనార్హం. ఇదంతా చూస్తే.. రేటు పెంచుకోవటానికి వీలుగా కొత్త బ్రాండ్ల రూపంలో అనుమతులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం 300 బ్రాండ్లు
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 300బ్రాండ్ల మద్యం అమ్మకాలకు అనుమతులు ఉన్నాయి. ఇవి సరిపోవన్నట్లుగా తాజాగా మరో పది కొత్త బ్రాండ్లకు అమ్మటానికి వీలుగా అనుమతులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మద్యం ప్రియులు మాత్రం అయోమయంలో పడ్డారట.. కారణం కొత్త బ్రాండ్లు అధిక ధరలు చూస్తే.. కొత్త సీసా పాత మందు సామెత గుర్తుకొస్తుందట పాపం.
