నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే విధాత, వరంగల్: వరంగల్‌లో రూ. 75కోట్లతో నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెప్పారు. బస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ లగ్జరీ బస్ సర్వీసును ఆర్టీసీ ఆర్ఎంతో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందని, రూ. 3800 కోట్లతో తూర్పు నియోజకవర్గం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రూ.1100వందల కోట్లతో మల్టీ […]

  • నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

విధాత, వరంగల్: వరంగల్‌లో రూ. 75కోట్లతో నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెప్పారు. బస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ లగ్జరీ బస్ సర్వీసును ఆర్టీసీ ఆర్ఎంతో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందని, రూ. 3800 కోట్లతో తూర్పు నియోజకవర్గం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రూ.1100వందల కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని తెలిపారు.

వరంగల్ ప్రజల చిరకాల ఆకాంక్ష నూతన బస్ స్టేషన్ రూ.75కోట్లతో నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా డీఎం, సంబంధిత అధికారులు, స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, జెడ్ఆర్సిసి మెంబర్ చింతాకులు సునీల్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated On 5 Jan 2023 1:01 PM GMT
krs

krs

Next Story