21 పరుగుల తేడాతో టీమ్ ఇండియాపై ఘన విజయ బ్యాటింగ్ లో మిచెల్, కాన్వే.. బౌలింగ్ లో సాంట్నర్ మెరుపులు ఆల్ రౌండ్ ఎబిలిటీతో అదరగొట్టిన న్యూజిలాండ్ తేలిపోయిన భారత బౌలింగ్.. బ్యాటింగ్ లోనూ ఫెయిల్.. విధాత, రాంచీ: వరుస పరాజయాలకు కివీస్ జట్టు చెక్ పెట్టింది. వన్డే సిరీస్ లో వైట్ వాష్ కు గురైన న్యూజిలాండ్ జట్టు టీ20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ ల విజయంతో సిరీస్ లో 1-0 […]

  • 21 పరుగుల తేడాతో టీమ్ ఇండియాపై ఘన విజయ
  • బ్యాటింగ్ లో మిచెల్, కాన్వే.. బౌలింగ్ లో సాంట్నర్ మెరుపులు
  • ఆల్ రౌండ్ ఎబిలిటీతో అదరగొట్టిన న్యూజిలాండ్
  • తేలిపోయిన భారత బౌలింగ్.. బ్యాటింగ్ లోనూ ఫెయిల్..

విధాత, రాంచీ: వరుస పరాజయాలకు కివీస్ జట్టు చెక్ పెట్టింది. వన్డే సిరీస్ లో వైట్ వాష్ కు గురైన న్యూజిలాండ్ జట్టు టీ20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ ల విజయంతో సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత డారిల్ మిచెల్, డేవిడ్ కాన్వే హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

177 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి పరాజయం పాలైంది. దీంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో కివీస్ 1-0 ఆధిక్యం సాధించింది. టీమ్ ఇండియా బ్యాటర్లలో సూర్యకుమార్ (47: 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర) మినహా ఎవరూ రన్స్ సాధించ లేకోపోయారు. హార్దిక్ పాండ్యా( 21:20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) చేశాడు.

చివరలో వాషింగ్టన్ సుందర్ (50: 25 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లు) పోరాడినా అప్పటికే చేయాల్సిన పరుగులు, బంతుల మధ్య భారీగా అంతరం పెరగడంతో విజయం దక్కలేదు. బ్యాటింగ్ లో అదరగొట్టి భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించిన కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

పరుగుల వేటలో టీమ్ ఇండియా ఫెయిల్

177 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు. 10 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ (4) బ్రేస్ వెల్ బౌలింగ్ లో ఔట్ కాగా.. 6 బంతులాడినా ఖాతా తెరవకుండానే జాకబ్ డఫీ బౌలింగ్ లో రాహుల్ త్రిపాఠి డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం స్కోరుబోర్డుకు మరో 4 పరుగులు జత కలిసిన అనంతరం శుభ్ మన్ గిల్ (7) సాంట్నర్ బౌలింగ్ లో ఔటై వెనుదిరిగాడు.

ఈ సమయంలో జత కలిసిన జట్టు వైస్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(47), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(20) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ఈ సమయంలో వెంటవెంటనే వీరిద్దరూ ఔట్ కావడంతో టీమ్ ఇండియాకు భారీ కుదుపుగా మారింది.

ఇష్ సోధి సూర్యను ఔట్ చేయగా.. బ్రేస్ వెల్ హార్దిక్ ను పెవిలియన్ కు పంపాడు. చివరలో వాషింగ్టన్ సుందర్ (50) పోరాడినా దీపక్ హుడా(10) శివమ్ మావి(2) వెంటవెంటనే వెనుదిరగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి155 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

భారత పేసర్ అర్షదీప్ సింగ్ చివరి ఓవర్ లో 27 పరుగులు ఇవ్వడం భారత్ కొంప ముంచింది. కివీస్ బౌలింగ్ లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 4 ఓవర్లలో కేవలం 11 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్రేస్ వెల్ 2, లోకీ ఫెర్గూసన్ 2 వికెట్లతో రాణించగా ఇష్ సోధి, డఫీ తలో వికెట్ సాధించారు.

మిచెల్ విధ్వంసం.. కాన్వే నిలకడ

కివీస్ ఇన్నింగ్స్ లో డెవాన్ కాన్వే (52 పరుగులు, 35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ ) , చివరలో డారిల్ మిచెల్ ( 59 పరుగులు, 30 బంతుల్లో 3ఫోర్లు,5 సిక్సర్లు) విధ్వంసంతో 176 పరుగుల భారీస్కోరు అందుకుంది. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్లతో విరుచుకుపడిన మిచెల్ 27 పరుగులు చేసి కివీస్ జట్టుకు భారీ స్కోరు అందించాడు.

తొలుత పవర్ ప్లేలో ఓపెనర్ ఫిన్ అలెన్(35 పరుగులు, 23 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) పవర్ చూపించగా.. ఈ తరుణంలో బౌలింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ వరుసగా అలెన్ సహా మార్క్ చాప్ మన్ ను డకౌట్ గా డగౌట్ కు పంపి కివీస్ స్కోరు వేగానికి కళ్లెం వేశాడు. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లో 20 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుతంగా రాణించాడు. వీరిద్దరు మినహా భారత పేసర్లు తేలిపోయారు.

ముఖ్యంగా అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 51 పరుగులిచ్చి మరోసారి ఎక్స్ పెన్సివ్ గా మిగిలాడు. డెత్ ఓవర్లలో తడబాటుతో నో బాల్స్ వేయడం ఈ మ్యాచ్ లోనూ అర్షదీప్ కంటిన్యూ చేయడంతో మిచెల్ ఆఖరి ఓవర్లో 27 పరుగులు బాదాడు.

Updated On 27 Jan 2023 5:43 PM GMT
krs

krs

Next Story