NIA గ‌తేడాది కారు పేలుడు కేసులో త‌మిళ‌నాడు, తెలంగాణ‌లో త‌నిఖీలు విధాత‌: త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 30 చోట్ల ఒకేసారి శ‌నివారం ఉద‌యం జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వ‌హించింది. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో అక్టోబ‌ర్ 23న‌ కారులో బాంబు పేలుడు జ‌రిగింది. ఈ పేలుడు వెనుక (ఐఎస్ ఐఎస్) ఇస్లామిక్ టెర్ర‌రిస్టుల హ‌స్తం ఏమైనా ఉండ‌వ‌చ్చ‌నే కోణంలో ఎన్ఐఏ అధికారులు రెండు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో ఏక‌కాలంలో త‌నిఖీలు నిర్వ‌హించారు. గత ఏడాది ఆక్టోబర్ 23న […]

NIA

  • గ‌తేడాది కారు పేలుడు కేసులో
  • త‌మిళ‌నాడు, తెలంగాణ‌లో త‌నిఖీలు

విధాత‌: త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 30 చోట్ల ఒకేసారి శ‌నివారం ఉద‌యం జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వ‌హించింది. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో అక్టోబ‌ర్ 23న‌ కారులో బాంబు పేలుడు జ‌రిగింది. ఈ పేలుడు వెనుక (ఐఎస్ ఐఎస్) ఇస్లామిక్ టెర్ర‌రిస్టుల హ‌స్తం ఏమైనా ఉండ‌వ‌చ్చ‌నే కోణంలో ఎన్ఐఏ అధికారులు రెండు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో ఏక‌కాలంలో త‌నిఖీలు నిర్వ‌హించారు.

గత ఏడాది ఆక్టోబర్ 23న కోయంబత్తూర్ కారు పేలుళ్ల ఘటన నేపధ్యంలో తమిళనాడు, హైద్రాబాద్‌లలో ఏకకాలంలో 31 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఉగ్రవాద భావజాల ప్రేరేపిత కుట్రను ఈ సోదాల్లో గుర్తించి భగ్నం చేసినట్లుగా ఎన్‌ఐఏ ప్రకటించింది.

హైద్రాబాద్‌లోని మలక్‌పేట, టొలిచౌకి, హుమాయున్ నగర్‌, పాతబస్తీ సహా 25 చోట్ల ఎన్‌ఐఏ బృంద్రాలు సోదాలు నిర్వహించామని, మొత్తం దక్షిణాది రాష్ట్రాలలో 31చోట్ల సోదాలను చేపట్టినట్లుగా తెలిపింది. తమ సోదాల్లో 60లక్షల నగదుతో పాటు విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించింది.

అరబిక్ భాషా పరిజ్ఞానం పేరుతో ఉగ్రవాద పాఠాలు బోధిస్తున్నారని, వాట్సాప్‌, టెలిగ్రామ్‌లలో యువతను ఐఎస్‌ఐఎస్ వైపు మళ్లింపు చేస్తున్నారని ఎన్‌ఐఏ ప్రకటించింది. పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, అరబిక్ భాష లోని ఉగ్ర సాహిత్యంతో కూడిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. సోదాల సందర్భంగా విచారణ నిమిత్తం పలువురని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

Updated On 16 Sep 2023 1:46 PM GMT
somu

somu

Next Story