Thursday, March 23, 2023
More
    Homelatestపీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి.. ప్రకటించిన నిమ్స్‌ వైద్యులు

    పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి.. ప్రకటించిన నిమ్స్‌ వైద్యులు

    విధాత: వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందింది. సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.

    కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధింపులను తాళలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్‌ చేసుకుని బలవన్మరణానికి యత్నించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.

    వరంగల్‌లో మరో ర్యాగింగ్ ఆత్మహత్య: విద్యార్థి వేధింపులతో ఇంజినీరింగ్ విద్యార్థిని సూసైడ్‌

    అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి.. ముందు వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపిచారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్‌ వైద్యుల బృందం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

    మంత్రి హరీశ్ రావు సంతాప ప్రకటన..

    మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకటన వివరాలిలా ఉన్నాయి. డాక్టర్ ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది.

    పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.

    Pawan Kalyan | అలా చేసి ఉంటే ఈ దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు..! మెడికో ప్రీతి మృతిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

    రేవంత్‌రెడ్డి సంతాపం

    ప్రీతి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె మృతి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

    డాక్టర్ ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా: మంత్రి ఎర్రబెల్లి

     

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular