విధాత, హైదరాబాద్: ఇటీవల ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందుతున్న సంఘటనాలు వెళ్లిపోతున్నాయి. జిమ్ చేస్తూ కొందరు.. పెళ్లి సంబురాల్లో డ్యాన్స్ చేస్తూ మరికొందరు.. ఇలా పలు కారణాలో ఉన్నచోటనే కుప్పకూలిపోయి మృతి చెందుతున్న సంఘటనా సర్వసాధారణంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నిన్న జిమ్ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్.. నేడు డ్యాన్స్ చేస్తూ యువకుడు..! సోషల్ మీడియాలో వీడియో వైరల్ https://t.co/7oQ8EJOa6B #viral #telangana #nirmal #adilabad pic.twitter.com/FJXcuBnw1A
— vidhaathanews (@vidhaathanews) February 26, 2023
రెండు రోజుల కిందట జిమ్ చేస్తూ ఓ కానిస్టేబుల్ మృతి చెందగా.. తాజాగా డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(కే) గ్రామానికి చెందిన కిష్టయ్య కొడుకు వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్‌లో జరిగింది.
శనివారం పార్డి(కే) లో వివాహ విందు వేడుక జరిగింది. పెళ్లి కొడుకు సమీప బంధువు మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19) అనే యువకుడు హాజరయ్యాడు. శనివారం రాత్రి రిసెప్షన్ జరుగుతున్న సమయంలో ముత్యం అందరితో సరదాగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. డ్యాన్స్ చేస్తూ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
View this post on Instagram
వెంటనే అక్కడున్న వారంతా భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. అప్పటి వరకు సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ముత్యం ఒక్కసారిగా కుప్పకూలడంతో అందరూ షాక్ అయ్యాడు.
ముత్యం మృతితో పెళ్లి ఇంట విషాదం అలుముకున్నది. ముత్యం డ్యాన్స్ చేస్తున్న సమయంలో కుటుంబీకులు వీడియో తీయగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.