Nita Ambani | రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సాధార‌ణ స‌మావేశంలో రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్ నీతా అంబానీ బ‌నార‌సీ జ‌రి చీర ధ‌రించి మెరిసిపోయారు. నీతా ముకేశ్ అంబానీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ప్రారంభం, రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ కార్య‌క్ర‌మాల ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా నీతా అంబానీ బ‌నార‌సీ చీర ధ‌రించి ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ చీర‌ను ప్ర‌ముఖ చేనేత క‌ళాకారుడు శ్రీ ఇక్బాల్ అహ్మ‌ద్ త‌న చేతితో నేశాడు. అయితే ఈ అద్భుత‌మైన నేత చీర వందేండ్ల […]

Nita Ambani |

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సాధార‌ణ స‌మావేశంలో రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్ నీతా అంబానీ బ‌నార‌సీ జ‌రి చీర ధ‌రించి మెరిసిపోయారు. నీతా ముకేశ్ అంబానీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ప్రారంభం, రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ కార్య‌క్ర‌మాల ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా నీతా అంబానీ బ‌నార‌సీ చీర ధ‌రించి ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ చీర‌ను ప్ర‌ముఖ చేనేత క‌ళాకారుడు శ్రీ ఇక్బాల్ అహ్మ‌ద్ త‌న చేతితో నేశాడు. అయితే ఈ అద్భుత‌మైన నేత చీర వందేండ్ల నాటి వార‌ణాసి చేనేత క‌ళ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తున్న‌ది. బ‌ర్ఫీ బూటీ, కొనియా పైస్లీ ప‌ద్ధ‌తులు, సంప్ర‌దాయ జ‌రీ వ‌ర్క్‌తో భార‌త‌దేశ క‌ళా వైవిధ్యాన్ని నీతా అంబానీ ధ‌రించిన బ‌నార‌సీ జ‌రి చీర డిజైన్ చాటి చెబుతున్న‌ది.

భారతదేశపు సంప్రదాయ హస్తకళలను కాపాడటం, ప్రోత్సహించడం లక్ష్యంగా రిలయన్స్‌ ఫౌండేషన్ స్వ‌దేశ్ కార్య‌క్ర‌మం తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్యక్రమం మద్దతిస్తున్న ప్రాంతీయ కళారూపాల్లో ఈ బనారసీ నేత కూడా ఒకటిగా ఉన్నది. బనారసీ జరీ చీరను ధ‌రించిన‌ నీతా అంబానీ చేనేత కళాకారులకు, ఈ కళను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న చేనేత కళ వారసత్వానికి ఘన నివాళులు అర్పించారు.

Updated On 31 Aug 2023 1:50 AM GMT
sahasra

sahasra

Next Story