విధాత: హైదరాబాద్‌ చివరి నిజాం నవాబు ముకర్రం జా (Mukarram Jha Bahadur) శనివారం కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా విదేశాల్లో ఉంటున్న ఆయన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన కోరిక మేరకు హైదరాబాద్‌ అంతిమ సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్‌ సంస్థాన భారతదేశంలో విలీనమయ్యే వరకు పాలించిన మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ మనుమడైన ముకర్రం జాను 1971లో రాజభరణాలు రద్దయే వరకు 8వ నిజాం నవాబుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సీఎం […]

విధాత: హైదరాబాద్‌ చివరి నిజాం నవాబు ముకర్రం జా (Mukarram Jha Bahadur) శనివారం కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా విదేశాల్లో ఉంటున్న ఆయన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన కోరిక మేరకు హైదరాబాద్‌ అంతిమ సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

హైదరాబాద్‌ సంస్థాన భారతదేశంలో విలీనమయ్యే వరకు పాలించిన మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ మనుమడైన ముకర్రం జాను 1971లో రాజభరణాలు రద్దయే వరకు 8వ నిజాం నవాబుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

సీఎం సంతాపం

హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం.. ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నిజాం వారసుడుగా, పేదల కోసం విద్య, వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

టర్కీలోని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి మరణించిన ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైదరాబాద్‌ కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్ కు సీఎం తెలిపారు. కేసీఆర్‌ సూచనల మేరకు అందుకు సంబంధించి ఎకె ఖాన్ సమన్వయం చేస్తున్నారు.

Updated On 15 Jan 2023 2:28 PM GMT
krs

krs

Next Story