Nizamabad విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజాంబాద్ జిల్లా డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అకౌంట్ సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేశారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఫైళ్ళను పరిశీలించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కొంతకాలంగా యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని చర్యలకు దిగిన ఈసీ.. వీసీ అక్రమాలకు పాల్పడ్డారని […]

Nizamabad

విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజాంబాద్ జిల్లా డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అకౌంట్ సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేశారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

ఫైళ్ళను పరిశీలించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కొంతకాలంగా యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని చర్యలకు దిగిన ఈసీ.. వీసీ అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్ ను మారుస్తున్న ఈసీ, కొత్త రిజిస్ట్రార్ ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈసీ సభ్యులకు వీసీకి మధ్య కొనసాగుతున్న ప్రచ్చన్న యుద్ధంతో యూనివర్సిటీ ప్రతిష్టను బజారు కీడ్చ‌డంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated On 6 Jun 2023 11:53 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story