YS Jagan | శివకుమార్, స్టాలిన్ ద్వారా డీల్ సెట్ చేసిన జగన్ ప్రతిగా షర్మిలకు ఆస్తులు ఇచ్చిన జగన్ విధాత: షర్మిళ కాంగ్రెస్ లో చేర్చుకుని ఏపీలో బాధ్యతలు అప్పగించాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ బ్రేకులు వేశారా ? షర్మిళ కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రాలో నాలుగుచెరగులా పర్యటిస్తే తనకు ఇబ్బంది అవుతుందని జగన్ భావించారా ? అందుకే కొందరు కాంగ్రెస్ పెద్దల ద్వారా ఆమె రాజకీయ ప్రస్థానానికి చెక్ పెట్టారా ? దీనికి గాను […]

YS Jagan |
- శివకుమార్, స్టాలిన్ ద్వారా డీల్ సెట్ చేసిన జగన్
- ప్రతిగా షర్మిలకు ఆస్తులు ఇచ్చిన జగన్
విధాత: షర్మిళ కాంగ్రెస్ లో చేర్చుకుని ఏపీలో బాధ్యతలు అప్పగించాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ బ్రేకులు వేశారా ? షర్మిళ కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రాలో నాలుగుచెరగులా పర్యటిస్తే తనకు ఇబ్బంది అవుతుందని జగన్ భావించారా ? అందుకే కొందరు కాంగ్రెస్ పెద్దల ద్వారా ఆమె రాజకీయ ప్రస్థానానికి చెక్ పెట్టారా ? దీనికి గాను ఆమెకు భారీగా ఆస్తులు ఇవ్వడానికి అంగీకరించారు ? ఏమో అదే నిజం అని కొందరు భావిస్తున్నారు.
ఈ మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఇంకా కర్ణాటక సీఎం స్టాలిన్ వంటివాళ్ళు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఆమె ఆంధ్ర కాంగ్రెస్ కు పెద్ద దిక్కు కాకుండా ఆపినట్లు చెబుతున్నారు. షర్మిళ కాంగ్రెస్ లో చేరితే ఆమె వెంట నడిచేందుకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు రెడీగా ఉన్నారు.
ఇది ఏపీలో జగన్ కు ఇబ్బందికరంగా మారుతుంది అందుకే జగన్ తన చెల్లెలు షర్మిళ ఆంధ్రా పాలిటిక్స్ లోకి రాకుండా తన మిత్రులు శివకుమార్, స్టాలిన్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంను ఒప్పించి ఆమెను కేవలం తెలంగాణ వరకే పరిమితం చేసేలా కథ నడిపించినట్లు చెబుతున్నారు.
దీంతో ఆమె ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని అంటున్నారు. దీనికి ప్రతిగా ఆమెకు తమ కుటుంబ ఆస్తి భారీగా వాటా ఇచ్చేనందుకు జగన్ అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఆస్తుల్లో ఆమెకు వాటా ఇవ్వడానికి జగన్ ఒప్పుకున్నట్లు, దీనికి శివకుమార్, స్టాలిన్ ఒప్పించినట్లు చెబుతున్నారు. దీంతో షర్మిళ ఇక ఏపీ రాజకీయాల్లోకి రాకుండా తెలంగాణాలో ఉంటారని అంటున్నారు.
