- తర్వాత తానూ కాల్చుకున్నాడు.
- ఇద్దరిదీ సోషియాలజీ థార్డ్ ఇయర్
- నోయిడాలోని శివ్‌నాడార్ వర్సిటీలో దారుణం
విధాత: గ్రేటర్ నోయిడా (Noida) లోని శివ్ నాడార్ యూనివర్శిటీలో దారుణం జరిగింది. బహుమతి తీసుకోవడానికి నిరాకరించిందనే కోపంతో ఓ విద్యార్థి స్నేహితురాలైన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు. అనంతరం తానూ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి వయస్సు 21 సంవత్సరాలు. వారిద్దరూ బీఏ సోషియాలజీ మూడవ సంవత్సరం చదువుతున్నారు. వర్సిటీ క్యాంపస్‌లోని బాలికలు, బాలుర హాస్టళ్లలో వీరు ఉంటున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..
గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో, వర్సిటీ క్యాంపస్‌లోని డైనింగ్ హాల్ వెలుపల మహిళా విద్యార్థిని తన క్లాస్‌మేట్ కాల్చి చంపాడని వర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రక్తపు మడుగులో ఉన్న కాన్పూర్‌కు చెందిన స్నేహ చౌరాసియా అనే విద్యార్థిని నోయిడాలోని యథార్త్ దవాఖానకు తరలించగా, ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనా స్థలం నుంచి కంట్రీమేడ్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు విద్యార్థులు చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తమ ప్రాథమిక విచారణలో తెలిసిందని గ్రేటర్ నోయిడా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ ఎం ఖాన్ తెలిపారు.
అయితే వారి సంబంధాలు ఇటీవల దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
Anuj Singh, a third year BA sociology student at Shiv Nadar university in Noida shot dead a girl student outside Dining hall and later killed self in his hostel room. pic.twitter.com/Qe2NLdLKQW
— Piyush Rai (@Benarasiyaa) May 18, 2023
మే 17 నుంచి యూనివర్సిటీకి వేసవి సెలవులు ఉన్నందున కాల్పులకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. కానీ, ఘటనకు సంబంధించిన దృష్ట్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని విచారణాధికారి తెలిపారు. “హాల్ కు లాక్ చేసినా కానీ గాజు తలుపులు ఉన్నాయి. ఇద్దరు విద్యార్థులు మధ్యాహ్నం 1 గంటలకు బయట కలుసుకున్నారు. హాలుకు ఇరువైపులా బాలికల, బాలుర వసతి గృహాలు ఉన్నాయి.
సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థులు కౌగిలించుకోవడం, మాట్లాడుకోవడం కనిపించింది. మగ విద్యార్థి విద్యార్థినికి ఇవ్వడానికి ఏదో ఒక బహుమతిని తెచ్చాడు. ఆమె పార్శిల్‌ను తీసుకోవడానికి తిరస్కరించింది. దాంతో అతడు ఆమెను కడుపులో తుపాకీతో కాల్చాడు. అతడిని నెట్టివేసి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ, అతను ఆమెను మరోసారి కాల్చడంతో కుప్పకూలిపోయింది. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయి మరో చోట తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.