విధాత‌: నోకియా( NOKIA) కనెక్టింగ్ పీపుల్… ఈ పేరు చెప్పగానే నీలం రంగులో అక్షరాలు ఇలా ప్రత్యక్షమై, రెండు చేతులు అలా కలవడం ఓ హృద్యమైన సీన్. కాల పరీక్షకు తట్టుకోలేక, మార్కెట్ పోటీలో నిలువలేక ఇప్పుడు వెనుకబడింది కానీ ఆ రోజుల్లో ఫోనంటే నోకియా.. ఎక్కువ కాలం మన్నిక, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ… మంచి నాణ్యత.. ఇవన్నీ కలిపి నోకియాను మార్కెట్లో మారాజును చేసాయి. తరువాత స్మార్ట్ ఫోన్ల కాలం రావడం, ఆ పోటీలో నిలువలేకపోవడంతో […]

విధాత‌: నోకియా( NOKIA) కనెక్టింగ్ పీపుల్… ఈ పేరు చెప్పగానే నీలం రంగులో అక్షరాలు ఇలా ప్రత్యక్షమై, రెండు చేతులు అలా కలవడం ఓ హృద్యమైన సీన్. కాల పరీక్షకు తట్టుకోలేక, మార్కెట్ పోటీలో నిలువలేక ఇప్పుడు వెనుకబడింది కానీ ఆ రోజుల్లో ఫోనంటే నోకియా.. ఎక్కువ కాలం మన్నిక, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ… మంచి నాణ్యత.. ఇవన్నీ కలిపి నోకియాను మార్కెట్లో మారాజును చేసాయి.

తరువాత స్మార్ట్ ఫోన్ల కాలం రావడం, ఆ పోటీలో నిలువలేకపోవడంతో సోనీ, శ్యాంసంగ్(SAMSUNG ,) మోటారోలా MOTOROLA ఫోన్లు రావడంతో మెల్లగా నోకియా ప్రభ మసకబారింది.. అసలు ఉనికి ప్రశ్నార్థకం అయింది.

60ఏళ్ల త‌రువాత‌..

దీంతో ఇప్పుడు మెల్లగా మళ్ళీ పునరుత్తేజం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న నోకియా దాదాపుగా 60 ఏళ్ల‌ తరువాత తన లోగోను మార్చింది. అక్షరాల డిజైన్లలో మార్పు చేర్పులు చేయడంతో పాటు, బ్లూ రంగును కూడా మార్చింది.

బార్సినోలాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఈ లోగోను ఆవిష్కరించారు. టెలికం ఉపకరణాల తయారీలో మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు, మార్కెట్లో కొత్తదనం తీసుకొచ్చేందుకు లోగోను మార్చినట్టు సంస్థ సీఈవో లాండ్మార్క్ ప్రకటించారు.

మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ కంపెనీలకు గట్టిపోటీగా..

టెలికం కంపెనీలకు ఉపకరణాలు, విడిభాగాలు అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించిన నోకియా సంస్థ, త్వరలోనే తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించబోతున్నట్టు ప్రకటించింది.

ఇందులో భాగంగా ఫ్యాక్టరీ ఆటోమేషన్, డేటా సెంటర్ల ఏర్పాటుపై నోకియా ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్(MICROSOFT) అమెజాన్‌ (AMAZON) కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వబోతోంది. భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా పేర్కొన్న నోకియా( NOKIA ..), ప్రస్తుతం దేశంలో తమకు తక్కువ మార్జిన్ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామని చెబుతోంది.

బిజినెస్ టెక్నాలజీ కంపెనీగా మార్పు..

ఇక అమెరికాలో ఈ ఏడాది ద్వితీయార్థానికి మరింత బలపడతామంటోంది. గత ఆర్ధిక సంవత్సరంలో 21 శాతం వృద్ధి సాధించినట్లు నోకియా పేర్కొంది. ముందు మాదిరిగా కేవలం మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా బిజినెస్ టెక్నాలజీ కంపెనీగా మారుస్తామని అంటున్నారు.

Updated On 27 Feb 2023 10:31 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story