విధాత: మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్సీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎంపీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ మేరకు బంగారిగడ్డ కూడలి నుంచి చండూరు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రాణాలు వ‌దిలారు త‌ప్పా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా వ‌ద‌ల‌లేద‌న్నారు. ఇవాళ మేమంతా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు వ‌దిలిన కార్య‌క‌ర్త‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని […]

విధాత: మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్సీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎంపీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ మేరకు బంగారిగడ్డ కూడలి నుంచి చండూరు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రాణాలు వ‌దిలారు త‌ప్పా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా వ‌ద‌ల‌లేద‌న్నారు.

ఇవాళ మేమంతా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు వ‌దిలిన కార్య‌క‌ర్త‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని వంద కేసులు పెట్టినా వెన‌క్కి తిరిగి చూడ‌కుండా కేసీఆర్‌తో, న‌రేంద్ర‌మోడీతో కొట్లాడుతున్నాం. దీనికి కార‌ణం మా ధైర్యం మీరు, మేము మీకు అండ‌గా ఉన్నాం త‌ప్పా ధైర్యం కాద‌ని కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి అన్నారు. మీరే మా గుండె, మీరే మా ఆత్మ అని రేవంత్ అని ప్ర‌సంగిస్తుండగా కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున చ‌ప్ప‌ట్లతో ఉత్సాహ పరిచారు.

ఎవ‌రికి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు, ఎవ‌రైనా కాంగ్రెస్ కార్య‌ర్త‌ల వైపు చూస్తే వాళ్లు గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటామ‌ని హెచ్చ‌రించారు. బీజేపీ వాళ్లు పైస‌లు ఇచ్చి కొందామ‌ని అనుకుంటున్నారు కానీ అమ్ముడు పోవ‌డానికి ఇక్క‌డ ఉన్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కాంట్రాక్ట‌ర్లు కాద‌న్నారు. కాంట్రాక్ట‌ర్‌ను ఎవ‌రినైనా మీరు కొని ఉంటే కొని ఉండ‌వ‌చ్చు అలాంటి ప‌రిస్థితిలో మేము లేమ‌న్నారు. బీజేపీ మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో గెలువాలంటే డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు నీళ్లు వ‌స్తాయి.

రూ. 5 వేల కోట్ల ప్యాకేజీ డిండి ప్రాజెక్టుకు ఇప్పించే ధైర్యం మీకు ఉన్న‌దా? తీసుకొచ్చే తెలివితేట‌లు, సోయి ఆ అభ్య‌ర్థికి ఉన్న‌దా అని స‌వాల్ విసిరారు. న‌మ్మించి మోసం చేసే దాంట్లో నిష్ణాతులు వ‌స్తారు. ఫోన్ల‌లో మాట్లాడుతారు, గెలిపించాల‌ని అడుగుతారు, లేక‌పోతే బెదిరిస్త‌రు, మీ సంగ‌తి చూసుకుంటామ‌ని అంటారు. ఈ పార్టీలో కాక‌పోతే ఆ పార్టీలో టికెట్ ఇప్పిస్తానే కొంతమంది స‌న్నాసులు కూడా మీకు ఫోన్లు చేస్తారు. వీళ్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ క‌న్న‌త‌ల్లి లాంటి పార్టీ అన్నారు. ఈ పార్టీని కాపాడే, నిల‌బెట్టే బాధ్య‌త మ‌న‌ది అన్నారు.

మునుగోడులో ఆడ‌బిడ్డ పాల్వాయి స్ర‌వంతి నిల‌బ‌డితే ఆమెను ఓడ‌గొట్ట‌డానికి ఢిల్లీ నుంచి మోడీ, అమిత్ వ‌చ్చారు. ఇక్క‌డ గ‌జ్వేల్ ఫాం హౌజ్‌లో ఉన్న కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్‌రావు వంద మంది ఎమ్మెల్యే వ‌చ్చారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 55 శాతం మ‌హిళా ఓట్లు ఉన్నాయి. ల‌క్షా ఇర‌వై వేల ఓట్లు ఉన్న మా ఆడ‌ప‌డుచుల‌ను నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా ఒక ఆడ‌బిడ్డ నిలబ‌డితే ఈ దేశ ప్ర‌ధాని, కేంద్ర హోం మంత్రి మునుగోడు గ‌డ్డ మీదికి వ‌చ్చి ఆమెను ఓడ‌గొట్టాల‌ని, ఆడ‌బిడ్డ‌ల ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్‌రెడ్డి, కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఆడ‌బిడ్డ‌ను ఓడ‌గొట్టాల‌ని చూస్తున్నారు. సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాల‌ని కుట్ర చేస్తున్నారు. 2008లో ఎంపీ చేయ‌డం త‌ప్పా, 2014లో ఎమ్మెల్సీ చేయ‌డం త‌ప్పా, 2018లో ఎమ్మెల్యేను చేయ‌డం త‌ప్పా అని రాజ‌గోపాల్‌రెడ్డిని ప్ర‌శ్నించారు.

క‌న్న‌త‌ల్లి లాంటి పార్టీని పొడిచి చంపాల‌ని చూస్తున్నారు. దీన్ని స‌మాజం ఆలోచ‌న చేయాల‌న్నారు. 12 సార్లు మునుగోడు గ‌డ్డ మీద ఎన్నిక‌లు జ‌రిగితే ఒక్క‌సారి కూడా ఆడ‌బిడ్డ గెలువ‌లేద‌న్నారు. ఒక్క అవ‌కాశం స్ర‌వంతికి ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. శివంగిలా కొట్లాడుతుంది, సీత‌క్క‌కు తోడుగా అసెంబ్లీలో మీ సమ‌స్య‌ల‌పై పోరాడుతుందని అన్నారు. కాబ‌ట్టి ఈ ఆడ‌బిడ్డ‌ను గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు.

Updated On 14 Oct 2022 12:18 PM GMT
krs

krs

Next Story