Friday, October 7, 2022
More
  Home latest కుప్పంలోనే చంద్రబాబు పరువు తీసిన జగన్!!

  కుప్పంలోనే చంద్రబాబు పరువు తీసిన జగన్!!

  ఉన్న‌మాట‌: ముప్పయ్యేళ్లుగా అక్కడ్నుంచి గెలుస్తున్న ఎమ్మెల్యేను, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును ముఖ్యమంత్రి జగన్ గాలి తీసేశారు. చంద్రబాబు అసలు స్థానికుడు కానేకాదని, నాన్ లోకల్ అని వెక్కిరించారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేదని తాను వచ్చాక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అప్ గ్రేడ్ చేశానని.. మున్సిపాలిటీగా చేశానని అన్నారు. భారీ జనసందోహం నడుమ జగన్ కుప్పంలో బహిరంగ సభలో మాట్లాడారు.

  మీ ఎమ్మెల్యే పక్కా నాన్ లోకల్. ఆయన ఉండేది హైదరాబాద్. సో ఆయన హైదరాబాద్‌కి లోకల్ కానీ కుప్పానికి మాత్రం దూరం. చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు లేదు ఓటు కూడా లేదని జగన్ ఎద్దేవా చేశారు. కుప్పం తన ఊరు అని అని ఏనాడు బాబు భావించలేదన్నారు. ఎన్ని సార్లు సీఎం అయినా కుప్పానికి ఏమీ చేసింది లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.

  హైదరాబాదు తనకు ముద్దు అని ఆయన అనుకున్నారు. హైదరాబాద్‌లో ఇంద్ర భవనం కట్టుకున్నాడు కుప్పంలో మాత్రం ఇల్లు కట్టలేదని విమర్శించారు. బీసీలకు న్యాయం చేశామని చంద్రబాబు చెబుతుంటారని.. కానీ కుప్పం నుంచి మొదలు పెడితే ఏపీ అంతటా బీసీలకు అన్యాయమే చేశారని విమర్శించారు. కుప్పం ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాదని, బీసీలు అధికంగా ఉండే ఇక్కడ వారికి అవకాశం కల్పించకుండా బాబు లాక్కున్నారని జగన్ అన్నారు.

  టీడీపీ పుట్టిన తరువాత 1983 నుంచి 2019 దాకా కుప్పం ఒక్కసారి కూడా కుప్పం బీసీలకు ఈ సీటు ఇవ్వలేదు ఇది బాబు మార్క్ సామాజిక న్యాయమని ఎద్దేవా చేశారు. ఆయన కుప్పానికి రారు ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారో పట్టించుకునేందుకు కూడా బాబు ఇష్టపడరు తనను పద్నాలుగేళ్ళు సీఎంగా చేసిన ప్రజలను గాలికి వదిలేశారని జగన్ దుయ్యబట్టారు. వెన్నుపోటుకు దొంగ ఓట్లకు చంద్రబాబు పెట్టింది పేరు అని నిందించారు.

  కుప్పంలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు మెడికలు కాలేజ్ లేదు అదేనా బాబు చేసిన నిర్వాకం అని జగన్ విమర్శించారు. అయితే ఇపుడు మాత్రం కుప్పం ప్రజలు ఇపుడు అభివృద్ధి వైపు సాగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కుప్పం ప్రజలు 2019 ఎన్నికల తరువాత జరిగిన మునిసిపల్ జడ్పీ, ఎంపీపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి బాబుకు గుణపాఠం చెప్పారన్నారు. మరో ఆరునెలల్లో నద్రీ నీవా కాలువ పనులు చేస్తామని హామీ ఇచ్చారు.

  కుప్పాన్ని మునిసిపాలిటీగా చేసి 66 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. 55 ఏళ్ళుగా ఒక కలగా మిగిలిన ఆర్డీవో ఆఫీస్‌ని కూడా వైసీపీ ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వం అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భరత్‌ని గెలిపించి కుప్పం తల రాత మార్చాలని జగన్ కోరారు. భరత్‌ని మంత్రిగా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

  మొత్తానికి కుప్పంలో జగన్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి సభ విజయవంతానికి గట్టిగా కృషి చేశారు. జన సమీకరణ, సభ నిర్వహణ మొత్తం ఆయనతో బాటు ఎంపీ మిథున్ రెడ్డి చూసుకున్నారు. మొత్తానికి భారీగా జనం హాజరైన ఈ సభ ద్వారా చంద్రబాబు ఇలాకాలో సైతం తమకు మంచి పట్టు ఉందని వైసీపీ నాయకులు.. ముఖ్యంగా పెద్దిరెడ్డి రుజువు చేసుకున్నారు.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page