Viral News | సినిమాలు చూశారని ఇద్దరు బాలుర కాల్చివేత..!
Viral News | ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ నియంతృత్వ పోకడలకు అంతే లేకుండా పోతున్నది. దక్షిణ కొరియా, అమెరికన్ సినిమాలు చూస్తున్నారనే కారణంతో ఇద్దరు బాలురకు మరణ శిక్ష విధించారు. 16, 17 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు బాలురను హైసన్‌లోని ఎయిర్ ఫీల్డ్‌లో జనం చూస్తుండగానే కాల్చి చంపారు. ర్యాన్ గాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు దక్షిణ కొరియాకు చెందిన కే-డ్రామాస్ (వెబ్ సిరీస్ లు), సినిమాలు, అమెరికా టీవీ […]

Viral News | ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ నియంతృత్వ పోకడలకు అంతే లేకుండా పోతున్నది. దక్షిణ కొరియా, అమెరికన్ సినిమాలు చూస్తున్నారనే కారణంతో ఇద్దరు బాలురకు మరణ శిక్ష విధించారు. 16, 17 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు బాలురను హైసన్‌లోని ఎయిర్ ఫీల్డ్‌లో జనం చూస్తుండగానే కాల్చి చంపారు. ర్యాన్ గాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు దక్షిణ కొరియాకు చెందిన కే-డ్రామాస్ (వెబ్ సిరీస్ లు), సినిమాలు, అమెరికా టీవీ షోలు చూడడమే కాకుండా, వాటిని విస్తృతంగా షేర్ చేవారని, కొందరికి విక్రయించారనే అభియోగాలు మోపారు.
ఉత్తర కొరియా చట్ట ప్రకారం.. ఇలాంటి కార్యక్రమాలు చూడడం నిషేధం. బాలురు ఇద్దరు చూడడమే కాకుండా ఇతరులను సైతం ప్రోత్సహించడంతో మరణ శిక్షను అమలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు బాలురను ఎయిర్ ఫీల్డ్‌లో కాల్చి చంపారు. కాగా, వీరిద్దరికీ శిక్ష అమలు చేసే సమయంలో అందరూ తప్పనిసరిగా చూడాలని అధికారులు స్థానికులను బలవంతంగా సంఘటనా స్థలానికి తరలించారు. కొద్దిరోజుల క్రితమే బహిరంగ సభలు నిర్వహించి విదేశీ మీడియా ప్రమేయంతో నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్థానికులకు అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన సినిమాలు చూడవద్దని, పాటలు వినవద్దని హెచ్చరించారు.
