Mp Arvind | విధాత, తెలంగాణలో కొత్తగా ప్రారంభించిన తొమ్మిది మెడికల్ కళాశాలల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదని, కేంద్రంమే వాటి స్థాపనకు 332.3కోట్లను గ్రాంట్‌గా ఇచ్చిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కుమార్ అన్నారు. కేంద్రం ఇచ్చిన గ్రాంటు సొమ్ముతో మెడికల్ కళాశాలలు నిర్మించి తామే కట్టినట్లుగా సీఎం కేసీఆర్ సంకలు గుద్దుకుంటూ ప్రజలను మభ్యపెడుతుందన్నారు. పైగా కేంద్రం పైసా ఇవ్వలేదంటు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. దేశంలో వైద్య కళాశాలలను […]

Mp Arvind |

విధాత, తెలంగాణలో కొత్తగా ప్రారంభించిన తొమ్మిది మెడికల్ కళాశాలల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదని, కేంద్రంమే వాటి స్థాపనకు 332.3కోట్లను గ్రాంట్‌గా ఇచ్చిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కుమార్ అన్నారు.

కేంద్రం ఇచ్చిన గ్రాంటు సొమ్ముతో మెడికల్ కళాశాలలు నిర్మించి తామే కట్టినట్లుగా సీఎం కేసీఆర్ సంకలు గుద్దుకుంటూ ప్రజలను మభ్యపెడుతుందన్నారు. పైగా కేంద్రం పైసా ఇవ్వలేదంటు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.

దేశంలో వైద్య కళాశాలలను పెంచాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయించి 157కళాశాలలు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలల్లోని టీచింగ్ స్టాప్ పైన ప్రభుత్వం శ్వేత పత్రం జారీ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలలపై గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉస్మానియా అసుపత్రికి కొత్త భవనం ఎందుకు నిర్మించలేదన్నారు.

Updated On 16 Sep 2023 1:45 AM GMT
krs

krs

Next Story