Governor Mishra లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బీడీ మిశ్రా న్యూఢిల్లీ : లద్దాఖ్‌లో అంగుళం భూమి కూడా చైనా ఆక్రమణలో లేదని ఆ కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బీడీ మిశ్రా స్పష్టంచేశారు. అటువంటి దుస్సాహసం చేస్తే ముక్కు పగలగొట్టేందుకు సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు. లద్దాఖ్‌లో పెద్ద మొత్తం విస్తీర్ణంలో భూమిని చైనా ఆక్రమించిందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందన కోరగా.. ‘ఎవరి స్టేట్‌మెంట్‌పైనో నేను వ్యాఖ్యానించను. అయితే.. నిజం ఏమిటో మాత్రం చెప్పగలను. […]

Governor Mishra

  • లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బీడీ మిశ్రా

న్యూఢిల్లీ : లద్దాఖ్‌లో అంగుళం భూమి కూడా చైనా ఆక్రమణలో లేదని ఆ కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బీడీ మిశ్రా స్పష్టంచేశారు. అటువంటి దుస్సాహసం చేస్తే ముక్కు పగలగొట్టేందుకు సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

లద్దాఖ్‌లో పెద్ద మొత్తం విస్తీర్ణంలో భూమిని చైనా ఆక్రమించిందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందన కోరగా.. ‘ఎవరి స్టేట్‌మెంట్‌పైనో నేను వ్యాఖ్యానించను.

అయితే.. నిజం ఏమిటో మాత్రం చెప్పగలను. నేను క్షేత్రస్థాయిలో స్వయంగా చూశాను. ఒక్క అంగుళం భూమి కూడా చైనా అక్రమణలో లేదు’ అని చెప్పారు. 1962లో ఏం జరిగిందనేది అప్రస్తుతం. కానీ.. ఈ రోజు మాత్రం అంగుళం భూమి కూడా చైనా ఆక్రమణలో లేదు’ అని స్పష్టం చేశారు.

సోమవారం నుంచి మూడు రోజులపాటు ఆర్మీ నిర్వహిస్తున్న నార్త్‌ టెక్‌ సింపోజియానికి రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ అయిన మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్‌ జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసం చేయజాలరని చెప్పారు

Updated On 12 Sep 2023 5:53 AM GMT
somu

somu

Next Story