విధాత‌, సినిమా: అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలియని విషయమేమీ కాదు. తన వీడియోలు, ఫోటోలు షేర్ చేయడమే కాదు.. ఆన్‌లైన్‌లో అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంటుంది. తాజాగా అనసూయను మీరు ఎప్పుడైనా లెస్బియన్ శృంగారంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించాడో నెటిజన్. ఈ ప్రశ్నకు మరొకరు అయితే సమాధానం చెప్పరు.. కానీ అక్కడ ఉంది అనసూయ.. సో వెంటనే సమాధానమిచ్చింది. మా కుటుంబంలో చాలా […]

విధాత‌, సినిమా: అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలియని విషయమేమీ కాదు. తన వీడియోలు, ఫోటోలు షేర్ చేయడమే కాదు.. ఆన్‌లైన్‌లో అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంటుంది.

తాజాగా అనసూయను మీరు ఎప్పుడైనా లెస్బియన్ శృంగారంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించాడో నెటిజన్. ఈ ప్రశ్నకు మరొకరు అయితే సమాధానం చెప్పరు.. కానీ అక్కడ ఉంది అనసూయ.. సో వెంటనే సమాధానమిచ్చింది.

మా కుటుంబంలో చాలా మంది లెస్బియన్స్ ఉన్నారు.. నేను లెస్బియన్ శృంగారంలో నేరుగా పాల్గొన లేదు కానీ.. ఆన్‌లైన్‌లో మాత్రం చాలా సార్లు లెస్బియన్ శృంగారం చేశానని సమాధానం ఇచ్చింది. పబ్లిక్‌గా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ‘గే’లు ఉన్నారని చెప్పిన అనసూయ అందరి మైండ్ బ్లాక్ చేసింది.

ఇది నిజంగా ఎవరూ ఊహించని స్టేట్మెంట్. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి అనసూయ తన తెగువ బయట పెట్టారు. అలాగే తనని సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టే వారందరినీ ఆమె ‘గే’లుగానే చూస్తానని చెప్పడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నిజంగా ఇది నెటిజన్లపై అనసూయ సంధించిన పవర్‌ఫుల్ పంచ్‌గా వర్ణించవచ్చు.

అనసూయ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘రంగమార్తాండ’, ‘పుష్ప 2’ చిత్రాలలో నటిస్తోంది. ‘రంగమార్తాండ’లో ఆమె పాత్ర పై ఆసక్తి నెలకొని ఉంది. ఈ మూవీలో ప్రెగ్నెంట్ ఉమెన్‌గా.. ప్రకాష్ రాజ్ కూతురి పాత్రలో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ‘పుష్ప’ విష‌యానికి వ‌స్తే.. పార్ట్ వన్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రే.. పార్ట్ 2 లో కూడా కొనసాసాగుతుంద‌ని అంటున్నారు.

ఇంకా పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ మానేసి ప్రస్తుతం నటిగానే కొనసాగుతున్నది. ఇది ఆమె అభిమానులకు నిరాశ పరిచే అంశం. మరో విషయం ఏమిటంటే.. బుల్లితెర షో మేకర్స్ టీఆర్పి కోసం చెత్త పనులు చేస్తున్నారంటూ అనసూయ దారుణమైన ఆరోపణలు చేసింది.

Updated On 25 Feb 2023 9:24 AM GMT
Somu

Somu

Next Story