సుమ ప్రశ్నకు తనదైన శైలిలో వివరణ ఇచ్చిన చిరు..!
విధాత: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు సినీ ప్రేక్షకుల కళ్ళన్నీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డిల పైనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఈ రెండు చిత్రాల కోసమే ఎదురు చూస్తున్నారు. గురువారం వీరసింహా రెడ్డి విడుదలవగా శుక్రవారం వాల్తేరు వీరయ్య సందడి చేయనుంది. చిరంజీవి దాదాపు 150 చిత్రాలకు పైగా చేసినప్పటికీ తన చిత్రాలకు ఈ స్థాయిలో ప్రమోషన్‌ను ఎప్పుడు చేయలేదు.
ప్రతి ఒక్క మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి మీడియా ప్రతినిధితో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజాగా చిరు తన వాల్తేరు వీరయ్య యూనిట్‌తో కలిసి సుమ నిర్వహిస్తున్న సుమ అడ్డా షోలో పాల్గొన్నారు.
మీరు ఎవరెవరి పేర్లను మీ ఫోన్లో ఏ పేరుతో సేవ్ చేసుకుంటారు అని ఫన్నీగా అడిగింది సుమ. దానికి చిరు అంతకంటే ఫన్నీగా హాస్య చతురతతో తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నా భార్య సురేఖ పేరును రే అని.. రామ్ చరణ్ పేరును చెర్రీ అని సేవ్ చేసుకుంటానని చిరు సమాధానం ఇచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ నెంబర్‌ను ఎలా సేవ్ చేసుకుంటారని సుమా అడగ్గానే ఆడిటోరియం మొత్తం అభిమానులు అరుపులతో దద్దరిల్లిపోయింది. దానికి చిరు సమాధానమిస్తూ పీకే అనో పవననో కాదు కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకుంటానని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన ప్రోమీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
కాగా ఈ ఎపిసోడ్ శనివారం ప్రసారం కానుంది. పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబునే. సినీ రంగ ప్రవేశం చేసిన మొదట్లో ఇదే పేరును వాడినప్పటికీ మెగా ఫ్యామిలీకి ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి మరో పేరు పవన్‌ని కళ్యాణ్ ముందు చేర్చారు.