ఈ నెల30న విచారణకు హాజరు కావాలి.. విధాత: హైదరాబాద్‌కు చెందిన సీసీఎస్‌ పోలీసులు ఈ నెల ౩౦న విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు నోటీస్‌లు జారీ చేశారు. సునీల్ క‌నుగోలు తరపున కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి నోటీసులు అందుకున్నారు. సునీల్‌ కనుగోలు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈనెల13వ తేదీన మాదాపూర్‌లోని కాంగ్రెస్‌ వార్‌ […]

ఈ నెల30న విచారణకు హాజరు కావాలి..

విధాత: హైదరాబాద్‌కు చెందిన సీసీఎస్‌ పోలీసులు ఈ నెల ౩౦న విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు నోటీస్‌లు జారీ చేశారు. సునీల్ క‌నుగోలు తరపున కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి నోటీసులు అందుకున్నారు.

సునీల్‌ కనుగోలు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈనెల13వ తేదీన మాదాపూర్‌లోని కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌( సునీల్‌ కనుగోలు కార్యాలయం)పై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు.

ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. సునీల్‌ కనుగోలుపై సెక్షన్లు 505, 465ల కింద కేసులు నమోదు చేశారు. విచారణలో సునీల్‌ కనుగోలును ప్రధాన నిందితుడిగా నిర్ధారించి ఈనెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సీసీఎస్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Updated On 27 Dec 2022 4:08 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story