QR BELL | మనం ఏదైనా ఆర్డర్ పెట్టి.. డెలీవరీ అయ్యే సమయానికి బయటకు వెళిపోతాం. దీంతో డెలీవరీ ఏజెంట్‌కి ఆ సమాచారం తెలియక వెనక్కి వెళ్లిపోతాడు. మరొకొన్ని ఘటనల్లో ఇంట్లో ఒంటరిగా మహిళలు ఉన్నపుడు.. డోర్ బెల్ మోగుతుంది. వచ్చిన వారెవరో తెలియక డోర్ తీయాలో లేదో సంశయం కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందులకు విరుగుడుగా ఏ వీడియో డోర్‌బెల్‌నో పెట్టుకుందామా అంటే వాటి ధరలు ఆకాశంలో ఉంటాయి. పైగా వైరింగ్, ఇన్‌స్టాలేషన్ ఖర్చులు అదనం. ఈ […]

QR BELL |
మనం ఏదైనా ఆర్డర్ పెట్టి.. డెలీవరీ అయ్యే సమయానికి బయటకు వెళిపోతాం. దీంతో డెలీవరీ ఏజెంట్‌కి ఆ సమాచారం తెలియక వెనక్కి వెళ్లిపోతాడు. మరొకొన్ని ఘటనల్లో ఇంట్లో ఒంటరిగా మహిళలు ఉన్నపుడు.. డోర్ బెల్ మోగుతుంది.
వచ్చిన వారెవరో తెలియక డోర్ తీయాలో లేదో సంశయం కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందులకు విరుగుడుగా ఏ వీడియో డోర్‌బెల్‌నో పెట్టుకుందామా అంటే వాటి ధరలు ఆకాశంలో ఉంటాయి. పైగా వైరింగ్, ఇన్‌స్టాలేషన్ ఖర్చులు అదనం.
ఈ బాధలేమీ లేకుండా మన సమస్యలు తీర్చడానికా అన్నట్లు ఒక కొత్త యాప్ పరిష్కారం కనుగొంది. అదే డోర్ వీఐ. దీనికి వైరింగ్ అవసరం లేదు. వేలకు వేలు పోసి కొనక్కర్లేదు. కేవలం రూ.400లతో డోర్ వీఐ క్యూ ఆర్ కోడ్‌ను కొనుగోలు చేసి.. దానిని మీ ఇంటి బయట అతికించుకోవాలి.
డెలివరీ ఏజెంట్లు కానీ, లేదా ఎవరైనా వచ్చినా వారికి తెలిసేట్లు ఆ కోడ్‌ను స్కాన్ చేయాలని కనిపించేలా రాస్తే సరి. వారు దానిని స్కాన్ చేయగానే ఆ కోడ్‌కు లింక్ అయి ఉన్న నంబరుకు వీడియో కాల్ వస్తుంది. వారు మనకు కనిపిస్తారు కానీ.. మనం వారికి కనిపించం.
ఇదే డోర్ వీఐ ప్రత్యేకత. ఆ కాల్‌లో పార్సిల్ ఎక్కడ పెట్టాలో డెలివరీ ఏజెంట్‌కు చెప్పొచ్చు, తెలియని వారు అయితే వీడియో కాల్‌లో వారు ఎవరో చూసి తెలుసుకోవచ్చు. ఇంకేముంది వెంటనే అమెజాన్‌లో కొనేయండి మరి..
