విధాత: చిరంజీవి రెండో కూతురు శ్రీజ అందరికీ బాగా సుపరిచితురాలే. నాడు తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మరల విడిపోయి తన తండ్రి చెప్పిన వ్యక్తిని వివాహం చేసుకోంది. ఈమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇన్స్టాగ్రాం వేదికగా పోస్టులు పెడుతూ ఉంటుంది. డే టు డే లైఫ్, ఫిట్నెస్ గురించి ఎక్కువగా పోస్టులు పెట్టే ఈమె తాజాగా తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఆమె న్యూ […]

విధాత: చిరంజీవి రెండో కూతురు శ్రీజ అందరికీ బాగా సుపరిచితురాలే. నాడు తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మరల విడిపోయి తన తండ్రి చెప్పిన వ్యక్తిని వివాహం చేసుకోంది. ఈమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇన్స్టాగ్రాం వేదికగా పోస్టులు పెడుతూ ఉంటుంది. డే టు డే లైఫ్, ఫిట్నెస్ గురించి ఎక్కువగా పోస్టులు పెట్టే ఈమె తాజాగా తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసింది.

ఈ సందర్భంగా ఆమె న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ డియర్ 2022.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. న‌న్ను ప్రేమించే అన్ని విధాలుగా సంరక్షించే ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే.. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం మొదలైంది.. అని రాసుకొచ్చింది. దీనికి తోడు ఆమె సెల్ఫ్ కనెక్షన్, ఇన్నర్ పీస్ అనే ట్యాగులను జత చేశారు. నిజానికి ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నప్పుడే ఇతరులను కూడా ప్రేమించగలడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది జీవితంలో చాలా ముఖ్యం.

మనల్ని మనం ప్రేమించుకుంటూ, మనల్ని మనం గౌరవించుకుంటూ, మన అభిప్రాయాలను, అభిరుచులను మనమే ఇష్ట పడకపోతే ఎదుటివారు మనల్ని ఇష్టపడడం, ప్రేమించడం సాధ్యం కాదు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే అందరినీ ప్రేమించగలం అనే వేదాంత సూత్రాన్ని శ్రీజ తనదైన శైలిలో తెలియ‌జేసింది. దీనిని చూసిన నెటిజ‌న్లు మీరు చెప్పింది నిజమే.

View this post on Instagram

A post shared by Sreeja (@sreejakonidela)

వ్యక్తిగత ప్రేమ అన్నిటికంటే ఎంతో ముఖ్యం. మనం సెల్ఫ్ కేర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.. అని కామెంట్స్‌ను జత చేస్తున్నారు. అయితే శ్రీజకు సంబంధించి రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయినట్లుగానే వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా శ్రీజ ఒంటరిగానే కనబడుతోంది. శ్రీజ రెండో భర్త, కల్యాణ్ దేవ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఏవేవో పోస్ట్‌లు పెడుతూ.. శ్రీజతో విడిపోయానని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీజ పోస్ట్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుండటం విశేషం.

Updated On 5 Jan 2023 6:12 AM GMT
krs

krs

Next Story