Thursday, December 8, 2022
More
    Homelatestఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. తెలుగుజాతి వెన్నెముక: బాలకృష్ణ

    ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. తెలుగుజాతి వెన్నెముక: బాలకృష్ణ

    విధాత‌, హైద‌రాబాద్: ఎన్టీఆర్‌ యూనివర్సీటీ పేరు మార్చడంపై తాజాగా బాలయ్య స్పందించారు. వైసీపీ వాళ్లవి.. సిగ్గులేని బతుకులు అని నందమూరి బాలకృష్ణ విమర్శలు చేశారు.

    మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదు..ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక అని అన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని నిప్పులు చెరిగారు.

    మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని చురకలు అంటించారు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page