విధాత: విజయవాడలోని నందమూరి తారక రామారావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (హెల్త్ యూనివర్శిటీ) పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెల్త్ యూనివర్శిటీగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. దీనిపై నందమూరి కుటుంబ సభ్యులంతా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయగా, ఒక రోజు ఆలస్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఆయన పేరు మార్పును వ్యతిరేకిస్తున్నారా? సమర్థిస్తున్నారా అన్నది సామాన్యులకు అర్థం కాని భాషలో చెప్పుకొచ్చారు. వైఎస్ ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ […]

విధాత: విజయవాడలోని నందమూరి తారక రామారావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (హెల్త్ యూనివర్శిటీ) పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెల్త్ యూనివర్శిటీగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. దీనిపై నందమూరి కుటుంబ సభ్యులంతా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయగా, ఒక రోజు ఆలస్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ఆయన పేరు మార్పును వ్యతిరేకిస్తున్నారా? సమర్థిస్తున్నారా అన్నది సామాన్యులకు అర్థం కాని భాషలో చెప్పుకొచ్చారు. వైఎస్ ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ సమాన స్థాయి వారే అంటూ మొదలు పెట్టిన ట్వీట్‌లో.. ఎన్టీఆర్ పేరు తీసేయడం వల్ల రామారావుకు గౌరవం తగ్గదు, వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల ఆయన స్థాయిని పెంచదు అంటూ తెలుగులో చేసిన ట్వీట్‌ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక జనం తికమక పడుతున్నారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022
