Wednesday, December 7, 2022
More
  Homelatestకేరళలో మరో ఘటన.. పిల్లలతో క్షుద్ర పూజలు

  కేరళలో మరో ఘటన.. పిల్లలతో క్షుద్ర పూజలు

  విధాత‌: కేరళలో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన వ్యవహారం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పథనంతిట్ట జిల్లాలో క్షుద్ర పూజలు చేస్తోన్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని మలయాళపుజా పట్టణానికి చెందిన ఓ మహిళ చిన్న పిల్లలను తన ఎదుట కూర్చోబెట్టి తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

  ఈ క్షుద్ర పూజలో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయిందని వెల్లడించారు. దీంతో స్థానికులు మంత్రగత్తె మహిళకు వ్యతిరేకంగా గురువారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆమెపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు.

  క్షుద్ర పూజలు చేస్తున్న ఆ మహిళను అరెస్ట్‌ చేసే వరకు ఆందోళనలు విరమించబోమన్నారు. దీంతో డీఎస్పీ ఆదేశాలతో ఆ మహిళను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగించడంపై ఆమెను నిలదీస్తున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page