విధాత: నకిరేకల్ మున్సిపాలిటీలోని దండేకుంట సర్వే నెంబర్ 89 ప్రభుత్వ భూమిని ఆక్రమించి చుట్టూ గేట్లు బిగించిన ప్రైవేట్ శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివాదాస్పద స్థలం వద్ద ప్రజా పోరాట సమితి(PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నూనె వెంకట్ మాట్లాడుతూ.. జిల్లా సర్యేయర్ దీనిని ప్రభుత్వ భూమి అని తేల్చగా, మున్సిపల్ కమీషనర్ చెట్లు నాటిన తరువాత ఏవిధంగా ప్రైవేట్ భూమి అవుతుందో జిల్లా కలెక్టర్ తేల్చాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తే పట్టించుకోని అధికార యంత్రాంగం పేదల హక్కులను ఎలా అడ్డుకుంటారో చూస్తామన్నారు.
ప్రభుత్వం అక్రమిత భూమి పరిరక్షణకు చర్యలు తీసుకొని పక్షంలో 200 మంది పేదలతో గుడిసెలు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్పీఎస్నాయకులు లింగయ్యయాదవ్, దుర్గం జలంధర్, మాగి సైదులు, కప్పల రాకేష్ గౌడ్, మహేశ్వరం సుధాకర్, చౌగోని సైదులుగౌడ్, పెంటమళ్ళ రమేష్ లు పాల్గొన్నారు.